Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
'ఈగ' హిందీ వెర్షన్ రిలీజ్ డేట్ ఖరారు
హైదరాబాద్: రాజమౌళి తాజా హిట్ చిత్రం 'ఈగ'ని హిందీలోకి డబ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రిలీజ్ తేదిని అక్టోబర్ 12 కి ఫిక్స్ చేసారు. ఈ విషయాన్ని రాజమౌళి ఖరారు చేసినట్లుగా నటుడు సుదీప్ చెప్తున్నారు. ఆయన మాట్లాడుతూ..." ఈగ హిందీ వెర్షన్ అక్టోబర్ 12న విడుదల చేస్తున్నారు. డైరక్టర్ రాజమౌళి ఈ విషయాన్ని ఖారుర చేసారు. ఇది ఓ గ్రేట్ న్యూస్. ఈ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను " అన్నారు.
హిందీకి మార్పులు ఏముంటాయి అని మీడియా వారు రాజమౌళిని సంప్రదించినప్పుడు ఆయన మాట్లాడుతూ...ఈగ పాత్ర కోసం అభిషేక్ బచ్చన్ ని సంప్రదించినట్లు చెప్తున్నారు. కానీ అది నిజం కాదు. అలాగే హిందీలో 3D వెర్షన్ ని కూడా విడుదల చేయటంలేదు. అయితే హిందీ ఆడియన్స్ కోసం కొన్ని మార్పులు చేస్తున్నాం. అవేమిటంటే...తెలుగు మాదిరిగానే హిందీలో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ డాన్స్ లను ఈగ చేయటం పెడుతున్నాం. అందుకు టైమ్ పడుతుంది అన్నారు.
సురేష్ బాబు మాట్లాడుతూ... "దబాంగ్, బాడీగార్డ్ లోని పాటలను ఈగ కోసం తీసుకుంటున్నాం అన్నారు. అలాగే త్రీడి లో చేస్తామని మీరు కూడా గతంలో అన్నారు కదా అంటే..మొదట్లో త్రిడీ వెర్షన్ నే విడుదల చేద్దామనుకున్నాం. కానీ అందుకు చాలా టైమ్ పట్టెటట్లు ఉంది అన్నారు. అలాగే ఏడు కోట్లు ఎగస్ట్రా అవుతుంది అది కూడా పరగణలోకి తీసుకోవాలి" అన్నారు. ఈగ తెలుగులోనే కాక, తమిళ, మలయాళ భాషల్లో కూడా సంచలన విజయం నమోదు చేసింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం హిందీ వెర్షన్ పై అందరి దృష్టీ వెళ్ళుతోంది.
నార్త్, మహా రాష్ట్రలలో ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు రాజమౌళి చెప్తున్నారు. ఇక ఈగ చిత్రాన్ని చిత్రం కథ గురించి రాజమౌళి మీడియా తో మాట్లాడుతూ...'ఓ దుర్మార్గుడితో 'ఈగ' చేసిన పోరాటం ఈ కథ. అలాగని ఈగని ఆకాశమంత పెద్దదిగా చూపించ లేదు. దానికేం అద్భుత శక్తుల్ని ఆపాదించడం లేదు. సాధారణ పరిమాణంలోనే ఉంటుంది. అయినా పోరాడుతుంది. విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేసారు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రధారులు. సాయి కొర్రపాటి నిర్మాత. సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఛాయాగ్రహణం: సెంథిల్‌కుమార్, సమర్పణ: డి.సురేష్‌బాబు.