కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన ‘ఈగ’
తాజాగా ఈచిత్రం ప్రఖ్యాత అంతర్జాతీయ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు 'ఈగ' చిత్రాన్ని కూడా ఎంపిక చేసారు. ఫిల్మ్ మార్కెట్ ఈవెంట్‌లో ఈచిత్రాన్ని ప్రదర్శిస్తున్నారట. ఈగ టీంతో పాటు'బాహుబలి' నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ కూడా ఈ ఫిల్మ్ పెస్టివల్‌కు హాజరవుతున్నారు.
ఈ విషయం గురించి ఆయన ట్విట్టర్లో వెల్లడిస్తూ...'తొలిసారిగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు మరియు ఫిల్మ్ మార్కెట్‌కు వెలుతున్నాను. ఎంతో ఎగ్జైట్‌గా ఉంది. మే 20వ తేదీన కేన్స్ ఫిల్మ్ మార్కెట్లో 'ఈగ' చిత్రాన్ని కూడా ప్రదర్శిస్తున్నాం' అని ఆయన ట్వీట్ చేసారు. ఈగ ప్రదర్శన తర్వాత 'బాహుబలి' సినిమాకు సంబంధించిన కొన్ని అంశాలను ఇంటర్నేషనల్ సినిమా సమాజం ముందు ప్రదర్శించనున్నారట.
'ఈగ' చిత్రానికి జాతీయ స్థాయిలో రెండు పురస్కారాలు లభించడం పట్ల సాయి కొర్రపాటి తన ఆనందం వ్యక్తం చేసారు. నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్ర ధారులుగా రాజమౌళి దర్శకత్వంలో సాయి కొర్రాపాటి నిర్మించిన ఈ చిత్రం మంచి కలెక్షన్స్ సాధించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications












