రాజమౌళి ‘ఈగ’ 50 రోజులు
హైదరాబాద్: టాలీవుడ్ నెం.1 డైరెక్టర్, దర్శక ధీరుడు రాజమౌళి తాజా సినిమా 'ఈగ' నేటి(ఆగస్టు 24)తో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుని విజయవంతంగా రన్ అవుతోంది. జులై 6న విడుదలైన ఈచిత్రం ఊహించని రెస్పాన్స్‌తో కలెక్షన్ల వర్షం కురిపించింది. తెలుగు, తమిళ వెర్షన్లలో విడుదలై ఆంధ్రా, తమిళనాడు, కర్నాటక, ఓవర్సీస్‌లోని అన్ని సెంటర్లలో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈవిజయంతో రెండు సంవత్సరాలు కష్టపడ్డ రాజమౌళి అండ్ టీం కృషి ఫలించినట్లయింది.
రాజమౌళి దర్శకత్వం, గ్రాఫిక్స్ మాయా జాలం, సుదీప్ క్రూరమైన నటన, సమంత గ్లామర్ ఈచిత్రాన్ని అందనంత ఎత్తుకు ఎదిగి...తెలుగు సినిమా కీర్తిని నలుదిశలా చాటింది. తెలుగు, తమిళం తెలియని వాళ్లు కూడా ఈచిత్రాన్ని చూసారంటే అందుకు కారణం ఈచిత్రంలోని అద్భుతమైన గ్రాఫిక్సే. దీంతో ఈచిత్రాన్ని కొన్ని చోట్ల ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో విడుదల చేసారు.
త్వరలో ఈచిత్రాన్ని హిందీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈగ తెలుగు వెర్షన్‌లో టాలీవుడ్ టాప్ హీరోలను ఇమిటేట్ చేస్తూ స్టెప్పులేసింది. అయితే హిందీలోనూ అదే సీన్లు పెడితే అక్కడి ప్రేక్షకులు ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున....బాలీవుడ్ టాప్ హీరోల డాన్స్ ను ఇమిటేట్ చేసేలా ఆ సీన్లను మోడరేట్ చేస్తున్నారు. హిందీ వెర్షన్లో సల్మాన్, హృతిక్ రోషన్ లాంటి వాళ్ల డాన్స్‌ను ఈగతో చేయిస్తారట.
రాజమౌళి దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించగా సురేష్ బాబు సమర్పణలో విడుదలైంది. ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, కెమెరా: సెంథిల్ కుమార్.


Click it and Unblock the Notifications











