సల్మాన్, హృతిక్‌లను టార్గెట్ చేసిన ‘ఈగ’
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఈగ' చిత్రం హిందీలో 'మక్కి' పేరుతో విడుదలవ్వనున్న సంగతి తెలిసిందే. త్వరలో ఇందుకు సంబంధించిన డబ్బింగ్ వర్క్ మొదలు కానుంది. ఈగ తెలుగు వెర్షన్‌లో టాలీవుడ్ టాప్ హీరోలను ఇమిటేట్ చేస్తూ స్టెప్పులేసింది.
అయితే హిందీలోనూ అదే సీన్లు పెడితే అక్కడి ప్రేక్షకులు ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున....బాలీవుడ్ టాప్ హీరోల డాన్స్ ను ఇమిటేట్ చేసేలా ఆ సీన్లను మోడరేట్ చేస్తున్నారు. హిందీ వెర్షన్లో సల్మాన్, హృతిక్ రోషన్ లాంటి వాళ్ల డాన్స్‌ను ఈగతో చేయిస్తారట. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత సురేష్ బాబు స్వయంగా వెల్లడించారు.
ఇప్పటికే ఈగ చిత్రం తెలుగు, తమిళంలో విడుదలై మంచి విజయం సాధించడంతో హిందీలోనూ కాసుల వర్షం కురిపిస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. బాషా బేదం లేకుండా ఈ గ్రాఫికల్ వండర్ చిత్రాన్ని చూసేందుకు తెలుగు, తమిళం తెలియని ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ చిత్రాన్ని కొన్ని చోట్ల ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో విడుదల చేశారు.
నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రల్లో రూపొందిన 'ఈగ' చిత్రం గ్రాఫికల్ వండర్ చిత్రంగా పేరు తెచ్చుకుని తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని నలుదిశలా చాటింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించగా సురేష్ బాబు సమర్పణలో జులై 6న విడుదలైంది. ఈ చిత్రానికి సంగీతం : కీరవాణి, కెమెరా : సెంథిల్ కుమార్.


Click it and Unblock the Notifications











