'ఈగ'హిందీ వెర్షన్ మార్పులు ఏమిటంటే...:రాజమౌళి
హైదరాబాద్: రాజమౌళి తాజా హిట్ చిత్రం 'ఈగ'ని హిందీలోకి డబ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే హిందీకి మార్పులు ఏముంటాయి అని మీడియా వారు రాజమౌళిని సంప్రదించినప్పుడు ఆయన మాట్లాడుతూ...ఈగ పాత్ర కోసం అభిషేక్ బచ్చన్ ని సంప్రదించినట్లు చెప్తున్నారు. కానీ అది నిజం కాదు. అలాగే హిందీలో 3D వెర్షన్ ని కూడా విడుదల చేయటంలేదు. అయితే హిందీ ఆడియన్స్ కోసం కొన్ని మార్పులు చేస్తున్నాం. అవేమిటంటే...తెలుగు మాదిరిగానే హిందీలో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ డాన్స్ లను ఈగ చేయటం పెడుతున్నాం. అందుకు టైమ్ పడుతుంది అన్నారు.
సురేష్ బాబు మాట్లాడుతూ... దబాంగ్,బాడీగార్డ్ లోని పాటలను ఈగ కోసం తీసుకుంటున్నాం అన్నారు. అలాగే త్రీడి లో చేస్తామని మీరు కూడా గతంలో అన్నారు కదా అంటే..మొదట్లో త్రిడీ వెర్షన్ నే విడుదల చేద్దామనుకున్నాం. కానీ అందుకు చాలా టైమ్ పట్టెటట్లు ఉంది అన్నారు. అలాగే ఏడు కోట్లు ఎగస్ట్రా అవుతుంది అది కూడా పరగణలోకి తీసుకోవాలి అన్నారు. ఈగ తెలుగులోనే కాక,తమిళ,మళయాళ భాషల్లో కూడా ఈ చిత్రం సంచలన విజయం నమోదు చేసింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం హిందీ వెర్షన్ పై అందరి దృష్టీ వెళ్ళుతోంది.
నార్త్, మహా రాష్ట్రలలో ఈ చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు రాజమౌళి చెప్తున్నారు. ఇక ఈగ చిత్రాన్ని చిత్రం కథ గురించి రాజమౌళి మీడియా తో మాట్లాడుతూ...'ఓ దుర్మార్గుడితో 'ఈగ' చేసిన పోరాటం ఈ కథ. అలాగని ఈగని ఆకాశమంత పెద్దదిగా చూపించ లేదు. దానికేం అద్భుత శక్తుల్ని ఆపాదించడం లేదు. సాధారణ పరిమాణంలోనే ఉంటుంది. అయినా పోరాడుతుంది. విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేసారు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రధారులు. సాయి కొర్రపాటి నిర్మాత. సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఛాయాగ్రహణం: సెంథిల్‌కుమార్, సమర్పణ: డి.సురేష్‌బాబు.


Click it and Unblock the Notifications











