‘ఈగ’ సినిమా డీవీడీ రెడీ..స్పెషాలిటీ ఏమిటంటే..
హైదరాబాద్ : రాజమౌళి హిట్ చిత్రం 'ఈగ'డీవిడి విడుదల అయ్యింది. ఈ డీవీడి స్పెషాలిటీ ఏమిటంటే... 'ఈగ' సినిమా రెండు గంటల మేకింగ్ డీవీడీని సినిమా డీవీడీతో పాటు విడుదల చేయటం. ఆదిత్యా వీడియోస్ సంస్థ తొలిసారిగా ఈ ప్రయత్నం చేసింది. ఆదిత్య అధినేత ఉమేష్‌గుప్తా మాట్లాడుతూ - ''తెలుగులో ఇదొక మంచి ప్రయత్నం. సినీ ప్రియులందరికీ ఇదొక అందమైన గిఫ్ట్‌ప్యాక్‌లాంటిది. సినిమాతో పాటు మేకింగ్ కూడా ఫుల్ క్వాలిటీతో ఇంగ్లీషు సబ్ టైటిల్స్‌తో ఉంటుంది. త్వరలో 'ఈగ' బ్లూరే డిస్క్‌ను కూడా విడుదల చేయబోతున్నాం'' అని చెప్పారు.
అలాగే... హాలీవుడ్, బాలీవుడ్‌లో ప్రతి సినిమా డీవీడీతో పాటు తప్పనిసరిగా మేకింగ్ డీవీడీని విడుదల చేస్తుంటారు. ఫలానా సీన్ ఎలా తీశారు, దర్శకుడు ఎంత కష్టపడ్డాడు... ఇత్యాది విషయాలన్నీ ఆ మేకింగ్ డీవీడీ ద్వారా ప్రేక్షకులకు అవగతమవుతుంటాయి. తెలుగులో కూడా సినిమా డీవీడీలతో పాటు అడపా దడపా మేకింగ్ డీవీడీలను విడుదల చేస్తున్నారు. అయితే ఆ మేకింగ్ నిడివి అరగంటకు మించి ఉండడంలేదు. అందుకే తొలిసారిగా ఈగ తో రెండు గంటల మేకింగ్ డీవీడీ ఇస్తున్నాం అన్నారు.
సరదా కుర్రాడైన నాని (నాని)ఎదురింటి అమ్మాయి బిందు (సమంత)ని ప్రేమిస్తాడు. అతని ప్రేమను ఆమె అంగీకరిస్తుందనే సమయానికి రావణాసుడులా సుదీప్ (సుదీప్)ఆమెపై కన్నేసి అడ్డుపడతాడు. అంతేగాక ఆమెను దక్కించుకోవటం కోసం నానిని దారుణంగా హత్య చేస్తాడు. అయితే కథ అక్కడితో అయిపోదు.. మగధీరలా నాని.. మరుజన్మ ఎత్తుతాడు. అయితే ఈ సారి ఈగ గా జన్మిస్తాడు. గతజన్మ స్మృతులతో తన ప్రేయసిని కాపాడుకునేందుకు సుదీప్ పై ఎడతెగని యుద్దం ప్రకటిస్తాడు. ఆ క్రమంలో ఏం జరిగింది. ఎలా బలవంతుడైన సుదీప్ నుంచి అతి సాధారణమైన ఈగ అయిన తాను .. తన ప్రేయసిని తప్పించాడు అనేది మిగతా కథ.


Click it and Unblock the Notifications











