అంత లేదు ఇంతే : ‘ఈగ’ కలెక్షన్లపై రాజమౌళి
హైదరాబాద్ : హైదరాబాద్: రాజమౌళి దర్వకత్వంలో వచ్చిన 'ఈగ' చిత్రం భారీ విజయం సాదించిన విషయం తెలిసిందే. కలెక్షన్లు కూడా భారీగానే వచ్చాయి. ఈగ చిత్రం తెలుగు, తమిళంలో కలిపి ఇప్పటి వరకు రూ. 130 కోట్లు కలెక్ట్ చేసిందని ఆ మధ్య వార్తలొచ్చాయి. దీనిపై రాజమౌళి స్పందించారు.
రూ. 130 కోట్లు వచ్చాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఏపితో పాటు అన్ని చోట్ల కలిపి ఓవరాల్ గా రూ. 90 కోట్లు కలెక్ట్ చేసిందని, అందులో రూ. 33 కోట్ల గ్రాస్ వచ్చిందని వెల్లడించారు. ఇందులో తమిళ రైట్స్, హిందీ రైట్స్, మళయాలం రైట్స్, తెలుగు వెర్షన్ శాటిలైట్స్, ఆడియో రైట్స్ అన్నీ కలిపితే ఈ మొత్తం వచ్చిందని స్పష్టం చేసారు.
ఈగ చిత్రాన్ని హిందీలో 'మక్కి' పేరుతో రిలయన్స్ ఎంటర్ టైనర్ వారు భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రలు పోషించిన ఈచిత్రంలో రాజమౌళి దర్శకత్వానికి, సుదీప్ నటనకు, కళ్లు చెదిరే గ్రాఫిక్స్‌కు ప్రేక్షకులు ఫుల్ మార్కులు వేసేశారు.
భారతీయ సినీ చరిత్రలోనే గొప్ప చిత్రంగా పేరు తెచ్చుకుంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించగా సురేష్ బాబు సమర్పణలో విడుదలైంది. ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, కెమెరా: సెంథిల్ కుమార్. ఈగ చిత్రం భారత్ తరుపున ఆస్కార్ బరిలో నిలుస్తుందని అనుకున్నప్పటికీ.... రణబీర్ కపూర్, ఇలియానా నటించిన 'బర్ఫీ' చిత్రంతో పోటీ పడలేక ఆస్కార్ అవార్డుల నామినేషన్‌కి ఎంపిక కాక పోయింది.


Click it and Unblock the Notifications











