మా సినిమానే టాలీవుడ్ నెం.1 : సురేష్ బాబు
'ఈగ' చిత్రం భారీ విజయం సాధించడంతో ఆ చిత్ర సమర్పకులు, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి. సురేష్ బాబు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ 'ఈగ' చిత్రం టాలీవుడ్ చరిత్రను తిరగ రాసిందని, ఇండస్ట్రీలోనే నెం.1 గ్రాసర్‌గా ఈచిత్రం నిలిచిందని...విడుదలైన పది రోజుల్లో ఏపీలో 10 కోట్ల షేర్, కర్నాటకలో 5 కోట్ల షేర్ ఇలా విడుదలై ప్రతి చోటా కాసుల వర్సం కురిపించిందని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా విడుదల కానన్ని దేశాల్లో ఈగ చిత్రాన్ని విడుదల చేశామని, ఊహించనంత అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయని చెప్పుకొచ్చారు.
భవిష్యత్ సినిమాల్లో అంతా విజువల్ ఎఫెక్టులదే హవా అని చెప్పుకొచ్చిన సురేష్ బాబు వరల్డ్ టాప్ 20 సినిమాల్లో అన్ని విజువల్ వండర్ సినిమాలే ఉన్నాయని. విజువల్ ఎఫెక్ట్‌కు మంచి కథ, దర్శకుడి ప్రతిభ తోడైతే వెండితెరపై అద్భుతాలు సృష్టించ వచ్చని అన్నారు.
ఈగ చిత్రం కోసం రాజమౌళి, అండ్ టీం 2 సంవత్సరాలు ఎంతో కష్ట పడ్డారు. ఇది నిజంగా తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ మూవీ. ఇలాంటి గొప్ప చిత్రంలో నేనూ భాగమైనందుకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. హిందీలో ఈగ చిత్రాన్ని 3డిలో విడుదల చేస్తున్నామని, హిందీలో ఈ చిత్రానికి 'మక్కి' అనే టైటిల్‌పై విడుదల చేస్తున్నామన్నారు.


Click it and Unblock the Notifications












