రజనీ కన్నా‘ఈగ’బాగా పాపులర్: రాజమౌళి
రజనీకాంత్ తెలియని దేశం ఉంటుంది కానీ, 'ఈగ' తెలియని దేశం ఉంటుందా? ఈగ ఎవ్వరికైనా ఈగే అంటున్నారు రాజమౌళి. దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాల్లోనూ ఈ నెల 6న 'ఈగ' ఎగరబోతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే గ్రాఫిక్స్ కూడా అంతే. స్టార్‌డమ్ సమస్య కూడా లేదాయె. అందుకే 'ఈగ'ను నాలుగు భాషల్లో చేశాం అన్నారు.
ఇక 'ఈగ'కథ ముందే చెప్పటం గురించి చెపుతూ.. 'ఈగ' ఫుల్‌బౌండ్ స్క్రిప్ట్ దొరికినా కూడా ఎవ్వరూ కాపీ కొట్టలేరు. కొన్ని కథల గురించి ప్రేక్షకులకు ముందు చెప్పేస్తేనే వాళ్లకూ ఆసక్తిగా అనిపిస్తుంది. అలా అన్ని కథల గుట్టు విప్పలేం. 'సింహాద్రి'ని ఇప్పుడు తీస్తే మాత్రం అస్సలు కథ చెప్పను అన్నారు. హీరో నాని ఎంపిక గురించి చెపుతూ.. అష్టా చమ్మా, అలా మొదలైంది హిట్ల తర్వాత నాని ఈ 20 నిమిషాల పాత్రకు ఒప్పుకుంటాడా అనిపించింది. కానీ తను వెంటనే ఒప్పుకున్నాడు అని క్లారిపై చేసారు.
హిందీలో 'ఈగ'ను త్రీడీలో విడుదల చేయటం గురించి చెపుతూ..నాకు వ్యక్తిగతంగా త్రీడీ సినిమాలంటే ఇష్టం లేదు. ఎందుకంటే బిగ్‌స్క్రీన్‌లో బిగ్ లెవిల్లో వచ్చే కిక్ త్రీడీలో రాదేమోననిపిస్తుంది. అందుకే కొంతమంది త్రీడీలో చేయమని సూచించినా, నేను ఒప్పుకోలేదు. అయితే ఈ మధ్య ప్రసాద్ స్టూడియో వాళ్లు దీన్ని త్రీడీగా కన్వర్ట్ చేద్దామన్నారు. నేను ఒప్పుకోలేదు అన్నారు.
అయితే చివరకు వాళ్లు బలవంతం చేయడంతో అయిష్టంగానే నాలుగైదు సీన్లు ఇచ్చి త్రీడీలో కన్వర్ట్ చేయమన్నా. తర్వాత వాళ్లు ఇచ్చిన అవుట్‌పుట్ చూసి అదిరిపోయా. అంత గొప్ప క్వాలిటీతో ఉంది. అయితే ఇప్పటికిప్పుడు కన్వర్షన్ అంటే మూడు, నాలుగు నెలలు పడుతుంది. అందుకే హిందీ వెర్షన్‌ని మాత్రం త్రీడీలో విడుదల చేద్దామనుకుంటున్నాం. హిందీ డబ్బింగ్ పూర్తయినా, ఇప్పుడు విడుదల చేయకపోవడానికి కారణం అదే అని వివరించారు.


Click it and Unblock the Notifications











