‘ఈగ’ మూవీ కాంటెస్ట్, గెలిస్తే ఉచిత పాసులు
దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న సాంకేతిక అద్భుతం 'ఈగ'. నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈచిత్రం చిత్రం ఆడియో ఈ నెల 30 విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి లోని బ్రహ్మకుమారి అకాడమిలో ఆడియో విడుదల కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ఆడియో కార్యక్రమానికి ఇప్పటి వరకు రాజమౌళి చిత్రాల్లోనటించి టాలీవుడ్ టాప్ యువ హీరోలతో పాటు, పలువరు హాట్ హీరోయిన్లు, స్టార్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు హాజరు కానున్నారు. ఈ ఆడియో కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉచితంగా పాసులకు దక్కించుకునే కాంటెస్ట్ ఒకటి నిర్వహిస్తున్నారు. 100 మంది వరకు ఈ పాసులు గెలుచుకోవచ్చు. ఈ కాంటెస్ట్‌లో విజేతలుగా నిలువాలంటే...ఈగ వెబ్ సైట్, ఈగ ఫేస్ బుక్ పేజ్, ఈగ ట్విట్టర్ పేజ్‌లను ఫాలో అవుతూ, అందులో అడిగే సులభమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడమే. మార్చి 30వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ కాంటెస్ట్ జరుగనుంది.
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు. దాదాపు 22 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం ఒకే సారి తెలుగు, తమిళంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మగధీర చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన సెంథిల్ కుమార్ ఈచిత్రానికి పని చేస్తుండటం మరో విశేషం.


Click it and Unblock the Notifications











