‘ఈగ’ మూవీ హైలెట్స్ ఇవే...
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఈగ' అంచనాలకు తగిన విధంగా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అద్భుతమైన గ్రాఫిక్స్‌తో పాటు ఎగ్జైట్‌మెంట్ కూడిన స్కీన్ ప్లే వెరసి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలోని కొన్ని హైలెట్స్ మీకోసం...
ఈగ చేసే విన్యాసాలు సినిమాకే హైలెట్. సమంత ఈచిత్రంలో అతి చిన్న కళాకండాలు తయారు చేసే ఆర్టిస్ట్. హిట్(ఈగల మందు) కొడితే ఈగకు ఏ హానీ జరుగకుండా అతిచిన్న మాస్క్, గాగుల్స్, ఆయుధాలు తయారు చేసి ఇస్తుంది. అదే విధంగా ఈగ కోసం తయారు చేసిన బుల్లి ఇల్లు బాగుంటుంది.
విలన్ సుదీప్‌పై ఈగ రివేంజ్ తీర్చుకునే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. నాని చనిపోయిన బాధలో సమంత ఏడుస్తుంటే....సమంత కన్నీటి చుక్కలతో నేనే నానిని అంటూ ఈగ రాసి చూపడం, ఐవిల్ కిల్ యూ అని సుదీప్‌కి ఈగ రాసి చూపడం ఆకట్టుకుంటుంది. సుదీప్ నటన చిత్రానికి మరో హైలెట్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ సీన్స్ అద్భుతంగా మలిచారు.
బ్లాంక్ మెసేజ్ అంటే బ్లాంక్ చెక్ అంత పవర్ ఫుల్. అక్కడ ఎంత అమౌంట్ కావాలంటే అంత అమైంట్ వేసుకోవచ్చు. తాగుబోతు రమేష్ ఒక సన్నివేశంలో కనిపించి నవ్విస్తాడు. ఏమైనా సరే ఊహించుకోవచ్చు. చిత్రం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. పాటలు సంగతి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.


Click it and Unblock the Notifications











