‘ఈగ’ చిత్రానికి బి. నాగిరెడ్డి అవార్డ్
హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన గ్రాఫికల్ వండర్ చిత్రం 'ఈగ'. ఇప్పటికే పలు అవార్డులు అందుకున్న ఈచిత్రం తాజాగా బి. నాగిరెడ్డి అవార్డుకు ఎంపికయింది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించిన సాయి కొర్రపాటి అవార్డును అందుకోనున్నారు. నాగిరెడ్డి జయంతి రోజున అవార్డు ప్రధానం జరుగనుంది.
విజయ సంస్థల అధినేతల్లో ఒకరైన సుప్రసిద్ధ నిర్మాత, స్వర్గీయ బి.నాగిరెడ్డి పేరిట ఆయన కుటుంబ సభ్యులు బి. నాగిరెడ్డి పురస్కారాన్ని గతేడాది ప్రారంభించారు. కుటుంబ విలువలు, సందేశం, వినోదం, వాణిజ్య అంశాలు మేళవించడంతో పాటు విశేష జనాదరణ పొందిన చిత్రాలను నిర్మించే నిర్మాతలకు ఈ అవార్డును ఇవ్వడం జరుగుతుంది.
తొలి అవార్డును గత సంవత్సరం నిర్మాత దిల్ రాజు 'మిస్టర్ పర్ ఫెక్ట్' చిత్రానికిగాను అందుకున్నారు. ఈ సారి ఈ అవార్డుకు 'ఈగ' చిత్రాన్ని నిర్మించిన సాయి కొర్రపాటిని ఎంపిక చేసారు. ఈగ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించగా.... వారాహి చలన చిత్రం పతాకంపై సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో సాయి కొర్రపాటి నిర్మించారు. భారీ సాంకేతిక విలువలతో రూపొందిన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు సాధించింది. ముఖ్యంగా గ్రాఫిక్స్ పరంగా మంచి టాక్ తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications












