భారీ సంఖ్యలో 'ఈగ' పైరసీ సీడీల స్వాధీనం
రాజమౌళి తాజా చిత్రం 'ఈగ' మొన్న శుక్రవారం విడుదలై సంచలనం విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేఫధ్యంలో ఈ చిత్రం పైరసీ సీడిలు భారీగా మొదలయ్యాయి. అనంతరం టౌన్ కమాలానగర్ లోని పైరసీ షాపులపై పోలీసులు శనివారం రాత్రి దాడులు చేసారు. ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. వారి వద్ద భారీ సంఖ్యలో ఈగ పైరసీ సీడీలను,పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని చోట్ల కూడా దాడులు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక 'ఈగ'విషయానికి వస్తే...ఈగ ను హీరోగా పెట్టి గ్రాపిక్స్ ప్రధాన పాత్రలో పూర్తి సినిమా చెయ్యటంతో అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొనింది. ముఖ్యంగా కథను ముందే రివిల్ చేసేయటంతో అందరూ తమకు తెలిసిన కథను తెరపై ఎలా చూపించాడా అని ఆసక్తిగా ధియోటర్స్ వైపు వెళ్లారు. దాంతో మొదటి రోజు కలెక్షన్స్ ఓ రేంజిలో వచ్చాయి.
కథ ప్రకారం నాని (నాని) సరదా కుర్రాడు. తొలి చూపులోనే బిందు (సమంత)ని ప్రేమిస్తాడు. మరో వైపు సుదీప్ (సుదీప్) కూడా ఇందుపై మనసుపడతాడు. ఎలాగైనా సరే... దక్కించుకోవాలనుకొంటాడు. తనకు తెలిసిన సామదానబేధదండోపాయాలను ప్రయోగిస్తాడు. వీటన్నింటికీ అడ్డుగా నిలుస్తున్నాడని నానిని హత్య చేస్తాడు. నాని ఆత్మ ఓ ఈగలోకి ప్రవేశిస్తుంది. సుదీప్ బారి నుంచి ఇందుని ఈగ కాపాడగలిగిందా? ఆ చిరు జీవి చేసిన పోరాటం ఫలించిందా? ఈ విషయాలన్నీ తెరపై చూసి తెలుసుకోవలసిందే.
రాజమౌళి మాట్లాడుతూ...'ఓ దుర్మార్గుడితో 'ఈగ' చేసిన పోరాటం ఈ కథ. అలాగని ఈగని ఆకాశమంత పెద్దదిగా చూపించడం లేదు. దానికేం అద్భుత శక్తుల్ని ఆపాదించడం లేదు. సాధారణ పరిమాణంలోనే ఉంటుంది. అయినా పోరాడుతుంది. విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేశాం అన్నారు.


Click it and Unblock the Notifications











