‘ఈగ’ సక్సెస్‌తో తెరపైకి వింత వివాదం!

By Bojja Kumar

రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఈగ' చిత్రం విజయం సాధించిన సంబరాల్లో యూనిట్ సభ్యులంతా ఆనందంతో సంబరాలు జరుపుకుంటుంటే....ఓ వింత వివాదం తెరపైకి వచ్చింది. ఈగ చిత్రం ఆంధ్రప్రదేశ్‌తో కర్నాటక, తమిళనాడు, కేరళలతో పాటు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ పలు ప్రాంతాల్లో విడుదలైన సంగతి తెలిసిందే. విడుదల ప్రతి చోట రాజమౌళి దర్శకత్వానికి, సుదీప్ నటనకు, విజువల్ ఎఫెక్ట్స్‌కి సినిమాకు హైలెట్ అనే టాక్ వినిపిస్తోంది.

రాజమౌళి తెలుగు సినిమా పరిశ్రమ గర్వించదగ్గ సినిమా తీశారని తెలుగు ఆడియన్స్ మురిసిపోతుంటే...కన్నడిగులు మాత్రం ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా కన్నడ వారిదే. నటుడు సుదీప్‌ వల్లనే సినిమా హిట్ అయింది అంటున్నారు. పలువురు వ్యూవర్స్ వన్ ఇండియా కామెంట్ బాక్సులో తమ తమ కామెంట్లతో వివాదానికి తెరలేపారు. కొందరు కన్నడిగులు రాజమౌళి కూడా కర్నాటకకు చెందిన వాడే అని, ఆయన కర్నాటకలోని రాయ్‌చూర్ నుంచి వచ్చారని వాదిస్తున్నారు. తెలుగు వారేమో ఆయన రాయ్‌చూర్లో పుట్టినమాట వాస్తవమేకానీ ఆయన రాజమండ్రికి చెందిన వారు అంటున్నారు. ఆ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

రాజ్ : ఈగ చిత్రం తెలుగు సినిమా పరిశ్రమ పవర్‌కి నిదర్శనం. తెలుగు దర్శకులు ఎంతటి టాప్ యాక్టర్లనైనా తమకు కావాల్సినట్లుగా మార్చుకుంటారు.

రాహుల్ : తెలుగు సినిమా డైరెక్టర్లకు అంత సీనే ఉంటే కర్నాటక నుంచి సుదీప్ ని ఎందుకు తీసుకుంటారు. తెలుగు నటులను తీసుకోవచ్చుకదా. సుదీప్ దగ్గర టాలెంట్ ఉంది కాబట్టే, ఆయనలాంటి పెర్ఫార్మెన్స్ ఇతరల వల్ల కాదు కాబట్టే తీసుకున్నాడు. మీ రాజమౌళిని అడుగు సుదీప్ టాలెంట్ గురించి వివరిస్తాడు.

రాజ్ : బాబూ...దయచేసి తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం అంటూ ప్రాంతీయ వాదం మాట్లాడొద్దు. యాక్టింగ్, పెర్ఫార్మెన్స్, డైరెక్షన్‌ను చూడండి...మంచి మూవీలకు మద్దతు ఇవ్వండి. ముందు మనం అంతా మనుషులం. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి సమ్ గుడ్ ఫిల్మ్ వస్తున్నాయి. ఆదరిచండి వాటి...

టిడిహెచ్ : చిన్న పిల్లాడు కూడా ఈ చిత్రం వెనక ఉన్న మార్కెటింగ్ ప్లాన్ అర్థం చేసుకుంటాడు. కన్నడ సినీ పరిశ్రమ వారు ఇతర పరిశ్రమల సినిమాల వల్ల ఇన్ సెక్యూర్ ఫీలవుతున్నారు. వాళ్లు డబ్బింగ్ చిత్రాలను అనుమతించడం లేదు. సుదీప్‌తో నటింప చేయడానికి అక్కడి మార్కెట్‌పై పట్టు సాధించడానికే...

కన్నదేవ్ సత్య : హేయ్ రాజ్...ఎస్ ఎస్ రాజమౌళి కూడా కన్నడిగుడే. ఆయన పుట్టింది కర్నాటకలోని రాయ్ చూర్ జిల్లాలో...

హరిష్ : రాజమౌళి పుట్టింది రాయ్‌చూర్లోనే కానీ...అతను కన్నడిగుడు కాదు. అతని ఫ్యామిలీది రాజమండ్రి.

జై : ఎవరైనా రాజమౌళి గురించి కామెంట్ చేసే ముందు నిజా నిజాలు తెలుసుకోండి. అతని ఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి సమీపంలోని కొవ్వూరు నుంచి వచ్చింది. అతను రాయ్‌‍చూర్లో పుట్టిన తెలుగువాడు.

ఇండియా : హే గైయ్స్...ప్రాంతల గురించి గొడవలొద్దు. భారతీయులుగా ఆలోచించండి. ప్రతిభను అభినందించండి...సినిమాను ఎంజాయ్ చేయండి.

శ్రీ : ప్రాంతాల గురించి గొడవలెందుకండీ...ఈగ చిత్రం ఓ అద్భుతమైన మూవీ. బాలీవుడ్ సైతం సౌత్ టాలెంట్ మీద ఆధార పడుతోంది. ఇక్కడి చిత్రాలను అక్కడి చాలా వరకు డబ్బింగ్ చేసుకుంటున్నారు. సౌత్ నుంచి మరిన్ని మంచి సినిమాలు రావాలని ఆశిద్దాం...

తెలుగు వన్ఇండియా

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X