ఈగ, సీతమ్మ వాకిట్లో రెండూ వారి సొంతమే
రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ఈగ. అలాగే దిల్ రాజు భారీగా నిర్మిస్తున్న చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ రెండు చిత్రాల ఓవర్ సీస్ రైట్స్ ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు సొంతం చేసుకున్నారు. దూకుడుతో ఓ రేంజికి వెళ్లిన ఈ సంస్ధ ఇప్పుడు సుకుమార్ తో మహేష్ హీరోగా చిత్రం రూపొందిస్తోంది. అనీల్ సుంకర,గోపీ ఆచంట, రామ్ ఆచంట ఈ గ్రూప్ నిర్మాతలు.
ఇక మహేష్, వెంకటేష్ కాంబినేషన్ లో అడ్డాల శ్రీకాంత్ కాంబినేషన్ లో రూపొందిస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు, సమంత కాంబినేషన్ రిపీట్ కావటం, వెంకటేష్ వంటి ఫ్యామిలీ స్టార్ కూడా ఈ సినిమాలో నటించటం ప్లస్ అవుతోంది. ఈ చిత్రంలో మహేష్, వెంకటేష్ అన్నదమ్ములుగా నటిస్తున్నారు. దూకుడు చిత్రం కూడా ఓవర్ సీస్ లో విపరీతమైన బిజినెస్ చేయటంతో ఈ సినిమా అక్కడ మంచి క్రేజ్ ని సంపాదించుకుంటుందని భావిస్తున్నారు.
అలాగే త్వరలో విడుదల కానున్న ఈగ చిత్రం రాజమౌళి ప్రతిష్టాత్మంగా రూపొందిస్తున్న ప్రయోగాత్మక చిత్రం. రాజమౌళికి ఓవర్ సీస్ లో మంచి మార్కెట్ ఉంది. అందులోనూ ఇప్పటివరకూ అపజయమెరగని దర్శకుడుగా రాజమౌళికి మంచి పేరు ఉండటం కూడా ఓపినింగ్స్ కి సహాయపడుతుంది. ఇక ఇప్పటికే విడుదల చేసిన ప్రోమోలు ఈ చిత్రాన్ని ఓ స్టాయికి తీసుకు వెళ్తున్నాయి. దాంతో ఇది ప్రాఫిట్ బుల్ వెంచర్ గా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు భావిస్తున్నారు.
ఇక 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు కంటిన్యూగా సినిమాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే రామ్ తో కూడా సినిమా చేసే అవకాశముందని తెలుస్తోంది. అలాగే వారు సుకుమార్ తో మహేష్ చేయబోతున్న సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











