'ఈగ'సక్సెస్ టూర్ డిటేల్స్
రాజమౌళి తాజా చిత్రం ఈగ మొన్న శుక్రవారం రిలీజైంది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా సక్సెస్ టూర్ ని ప్రారంభించారు. మొదటిగా తెలంగాణా జిల్లాలు ఆ తర్వాత ఆంధ్రా కోస్తా జిల్లాలు కవర్ చేస్తున్నారు. ఈ టూర్ రెండు రోజులు పాటు సాగుతుందని చెప్తున్నారు. ఇక ఈగ సక్సెస్ ని నిర్మాత సురేష్ బాబు,దర్శకుడు రాజమౌళి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సురేష్ బాబు తాను బాగా ప్రౌడ్ ఫీలవుతున్నారని చెప్తున్నారు.
తెలుగు మీడియా కానీ,కన్నడ మీడియా కానీ, తమిళ మీడియా కానీ,నార్త్ ఇండియా మీడియా కానీ అన్ని చోట్లా ఇనానమస్ గా సినిమాని మనం ప్రమోట్ చేయాలి. ఈ సినిమాని అందరికీ తెలియాలి. మాగ్జిమం మెంబర్ ఆఫ్ జనాలు చూడాలి అనే ఒక కంకణం కట్టుకున్నట్లుగా ప్రమోట్ చేసారండీ..ఒక కొత్త కథ వస్తోంది. ప్రతీసారి మన ఇండియాలో కొత్త కథలు రావటం లేదు. కొత్త సినిమాలు రావటం లేదు..ఒక వెరైటి సినిమాలు రావటం లేదు...అనే రకరకాల కామెంట్స్ కు ఆన్సర్ గా ఈ సినిమా ని ఫీలయ్యారు అనుకుంటున్నాను. అలా ఫీలై ప్రమోట్ చేసారండీ...ఆయాం రియల్లీ వెరీ ధాంక్ ఫుల్ ..రేపు,ఎల్లుండి ఒక చిన్న మినీ టూర్ వేస్తున్నాం అన్నారు రాజమౌళి.
అలాగే సురేష్ బాబు మాట్లాడుతూ...అందరూ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు ఈ సినిమాని. మేము రేపు సక్సెస్ టూర్ ని ప్లాన్ చేస్తున్నాం. హైదరాబాద్ నుంచి కరీం నగర్, కరీం నగర్ నుంచి వరంగల్, వరంగల్ టు హన్మకొండ, హన్మకొండ టు ఖమ్మం, రేపు రాత్రికి రాజమండ్రి చేరుతాం. ఎల్లుండి రాజమండ్రిలో స్టార్ట్ చేసి అక్కడ నుంచి ఏలూరు,గుంటూరు,విజయవాడ కవర్ చేస్తాం అన్నారు. అక్కడ లోకల్ మీడియా,పబ్లిక్ ని కలుస్తాం అన్నారు.


Click it and Unblock the Notifications











