‘ఈగ’ టిక్కెట్స్ హౌస్‌ఫుల్.... ప్రీమియర్ షో డీటేల్స్
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఈగ' చిత్రానికి స్టార్ హీరోల లెవల్లో అంచనాలు పెరిగి పోతున్నాయి. ఈ చిత్రానికి ఇంత క్రేజ్ రావడానికి కారణం కేవలం రాజమౌళి దర్శకత్వమే. ఈ నెల 6న విడుదల కానున్న ఈ చిత్రం తొలి రోజు టిక్కెట్స్ అన్నీ ప్రసాద్ ఐమాక్స్‌లో ఇప్పటికే బుక్ అయి పోయాయి. రాష్ట్రంలోని మిగతా ప్రదేశాల్లోకూడా ఇలాంటి పరిస్థితే ఉంది.
సాధారణంగా సినిమా విడుదలకు ఒక రోజు ముందు ప్రీమియర్ షోలు వేస్తూ ఉంటారు. అయితే ఈగ చిత్రానికి మాత్రం అదే రోజే ఉదయం 8 గంటలకు హైదరాబాద్ కూకట్‌పల్లిలోని బ్రమరాంబ, మల్లిఖార్జున థియేటర్లలో ప్రీమియర్ షోలు వేస్తున్నారు. టిక్కెట్ల వివరాల కోసం 8686035699, 8686035681, 8686035682 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈచిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించగా సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో సాయి కొర్రపాటి వారాహి చలన చిత్రం పతాకంపై ఈచిత్రాన్ని నిర్మించారు. ఈచిత్రంలో ఈగ క్యారెక్టర్‌కు స్వయంగా రాజమౌళి డబ్బింగ్ చెప్పడం గమనార్హం.
మగధీర చిత్రానికి పని చేసిన కెమెరామెన్ సెంథిల్ కుమార్ ఈగకు పని చేశారు. అదే విధంగా గ్రాఫిక్స్ అద్భుతంగా రావడానికి అత్యాధునిక టెక్నాలజీని వాడటంతో పాటు, విదేశీ నిపుణుల సాయం తీసుకున్నారు. ఈగ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో గతంలో ఏ సినిమాలోనూ ఆవిష్కరింపబడని అద్భుతమైన గ్రాఫిక్స్‌తో ప్రేక్షకులను సంబ్రమాశ్చర్యాలకు గురి చేస్తుందనడంల ఎలాంటి సందేహం లేదు.


Click it and Unblock the Notifications











