హిట్ టాక్‌తో ఎగిరి గంతేస్తున్న ఈగ యూనిట్

By Srinivas

ఈగ చిత్రంకు హిట్ టాక్ రావడంతో సినిమా యూనిట్ సంబరాలలో మునిగి తేలుతోంది. శుక్రవారం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ చిత్రం విడుదలయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం మొదటి ఆట చూసిన ప్రేక్షకులు సూపర్బ్ అంటున్నారు. ప్రేక్షకుల ప్రశంసలతో ఈగ టీం ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఈ సందర్భంగా ఈగ దర్శకులు రాజమౌళి, సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి, కథానాయకుడు నాని, ప్రతినాయకుడు సుదీప్ మాట్లాడారు.

ఈగ సినిమాకు హిట్ టాక్ వచ్చిందని రాజమౌళి అన్నారు. తమ్ముడు రాజమౌళి వారాహి చలన చిత్రం బ్యానర్ పైన మొదటిసారి సినిమా తీసి హిట్ కొట్టాడని దర్శకులు కీరవాణి అన్నారు. ఈ సినిమాకు ఇంతగా స్పందన రావడానికి అందరూ కారణమని నాని అన్నారు. సినిమాకు హిట్ టాక్ రావడం సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పారు. సినిమాకు ఆదరణ బాగుందని సుదీప్ అన్నారు.

కాగా రాజమౌళి తాజా చిత్రం 'ఈగ' అంతటా బారీ ఎత్తున విడుదల అయిన సంగతి తెలిసిందే. దాదాపు ముప్పై రెండు కోట్లు వరకూ ఖర్చు అయింది. ఈగ సీన్స్ చిత్రీకరించటం కోసం రోబో ని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో రోబోని నిజమైన ఈగ లాగ గ్రాఫిక్స్ సాయింతో మార్చారు. ఈ రోబో కోసం చాలా ఆధునికమైన పరికరాలు, ఇప్పుడు వరకూ తెలుగు పరిశ్రమ ఉపయోగించనవి వాడాల్సి వచ్చింది.

ఫేస్ బుక్, ట్విట్టర్, మీడియా, టీవీ ఛానెల్స్ అనే తేడా లేకుండా ఈ చిత్రాన్ని భారీ లెవల్లో పబ్లిసిటీ చేశారు రాజమౌళి. నాని పాత్రలో నాని, ఇందు పాత్రలో సమంత నటించింది. మధ్యలో సుదీప్ పాత్ర ప్రవేశించి ఏం చేసిందనేదే కథ. ఈ చిత్రానికి సంగీతం కీరవాణి, స్టైలింగ్.. రమా రాజమౌళి, ఛాయాగ్రహణం..సెంధిల్ కుమార్, సమర్ఫణ డి.సురేష్ బాబు.

సంస్థ: వారాహి చలనచిత్రం
నటీనటులు: నాని, సమంత, సుదీప్‌, ఆదిత్య మీనన్‌, దేవదర్శిని, నోయల్‌, హంసానందిని తదితరులు.
ఛాయాగ్రహణం: సెంథిల్‌కుమార్
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సమర్పణ: డి.సురేష్‌ బాబు
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాత: సాయి కొర్రపాటి
దర్శకత్వం: ఎస్‌.ఎస్‌.రాజమౌళి
విడుదల: శుక్రవారం.
సమర్పణ: డి.సురేష్‌ బాబు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X