కమల్ హాసన్ స్దాయి నటుడు: కీరవాణి
సుదీప్ చాలా అద్బుతమైన నటనను ప్రదర్శించాడు. ఆ రోల్ అతను ఓ పెద్ద చాలెంజ్ గా భావించాడు. సినిమా మరింత క్వాలిటీగా రావటానికి సుదీప్ తన క్వాలిటీ నటనతో అద్బుతంగా కంట్రిబ్యూట్ చేసారు. అలాంటి నటలు మరికొంత మంది మనకు ఉన్నట్లైతే బారతీయ సినిమా ప్రపంచ సినిమా స్ధాయికి ఎదుగుతుంది అనటంలో సందేహం లేదు. కమల్ హాసన్ తర్వాత ఆ స్ధాయి నటుడు సుదీప్ మాత్రమే అని ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కితాబు ఇచ్చారు.
సుదీప్ ప్రస్తుతం కీరవాణి సంగీతం అందించిన ఈగ చిత్రంలో విలన్ గా చేసిన సంగతి తెలిసిందే. వచ్చే నెల ఆరవ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ ఇలా స్పందించారు. ఈ చిత్రాన్ని తమింళంలో 'నాన్ ఈ' టైటిల్ తో విడుదల చేస్తున్నారు. ఇక ఈ చిత్రం తమిళ వెర్షన్ శాటిలైర్ రైట్స్ ఓ రేంజిలో పలికి అందరికీ షాక్ ఇచ్చింది. తమిళంలో నెంబర్ వన్ ఛానెల్ అయిన సన్ టీవీ వారు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని 3.35 కోట్లుకు కొనుగోలు చేసారు. ఓ తెలుగు డైరక్టర్ డైరక్ట్ చేసిన చిత్రానికి ఈ రేంజి రేటు పలకటం తమిళ శాటిలైట్స్ హిస్టరీలోనే ఓ పెద్ద రికార్డు అంటున్నారు. నాని, సమంత హీరో హీరోయిన్లుగా, కన్నడ నటుడు సుదీప్ విలన్ గా నటించిన ఈ చిత్రం తమిళ వెర్షన్‌ను పీవీపీ సినిమా నిర్మిస్తోంది.
ఇక రాజమౌళి ఈగని బైలింగ్వల్ గా విడుదల చేయనున్నట్లు తెలిపారు. మీడియాలో ఈగ చిత్రాన్ని నాన్ ఈ అనే టైటిల్ తో తమిళంలో డబ్బింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేస్తూ మాట్లాడారు.ఆయన మాటల్లోనే...ఈగలోని ప్రతీషాట్ ని తెలుగు,తమిళ భాషల్లో సెరపేట్ గా చిత్రీకరించాము. నాన్ ఈ ఆనే చిత్రం తమళ డబ్బింగ్ వెర్షన్ కాదు. అది బైలిగ్వల్. ఇక హిందీలలో ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నాము. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర జరుపుకుంటోంది.
సమంత, నాని, కన్నడ స్టార్ సుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కీలక పాత్రను పోషించనుంది. తెలుగు వెర్షన్ కి సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి యం యం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 'ఈగ' సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే 'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ' రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ'గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ'ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ' అన్నదే క్లుప్తంగా ' ఈగ' కథాంశం.


Click it and Unblock the Notifications











