»   » రామోజీరావు మనవరాలి పెళ్లిలో పవన్ క్రేజ్!.. సెలబ్రీటీల మధ్య..

రామోజీరావు మనవరాలి పెళ్లిలో పవన్ క్రేజ్!.. సెలబ్రీటీల మధ్య..

Written By:
Subscribe to Filmibeat Telugu

ఈనాడు సంస్థల అధినేత, చైర్మన్ రామోజీరావు మనువరాలు సహారీ పెళ్లి రామోజీ ఫిలింసిటీలో శుక్రవారం అర్థరాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు తరలివచ్చారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు సూపర్‌స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, మోహన్‌బాబు, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, రాజమౌళి, త్రివిక్రమ్, హిందీ చిత్ర పరిశ్రమ నుంచి అభిషేక్ బచ్చన్ తదితరులు హాజరయ్యారు.

ఈనాడు ఎండీ కిరణ్ కుమార్తె సహారి

ఈనాడు ఎండీ కిరణ్ కుమార్తె సహారి

ఈనాడు ఎండీ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజ కుమార్తె సహారి వివాహం పారిశ్రామిక వేత్త కృష్ణ ఎల్లా దంపతుల కుమారుడు రాచేస్ వీరేంద్రతో జరిగింది. సహారి ఉన్నత విద్యను బ్రిటన్‌లో పూర్తి చేసింది. లండన్‌లోని ఇంపిరియల్ కాలేజి నుంచి మాస్టర్స్, బెంట్లే యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ పొందారు.

ప్రముఖులు భారీగా

ప్రముఖులు భారీగా

రాచెస్ కూడా అమెరికాలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. అట్లాంటాలోని ఎమోరీ యూనివర్సిటీ నుంచి క్లినికల్, మెడికల్ రంగంలో మాస్టర్స్ డిగ్రీ అందుకొన్నారు. సహారి, రాచెస్ వివాహానికి సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు భారీగా తరలివచ్చారు.

పవన్ కల్యాణ్‌తో

పవన్ కల్యాణ్‌తో

రామోజీ ఇంట జరిగిన శుభ కార్యక్రమానికి దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత రాధాకృష్ణతో కలిసి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. పవన్‌ కల్యాణ్‌ను రామోజీరావు సాదరంగా ఆహ్వానించారు. వ్యక్తిగతం కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ఫోకస్, అతిథుల దృష్టి పవన్ కల్యాణ్‌పైనే ఉండటం గమనార్హం.

అభిషేక్ బచ్చన్‌తో

అభిషేక్ బచ్చన్‌తో

రాజకీయ రంగం నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, ఏపీ సీఎం చంద్రబాబు, కాబోయే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి, టీపీసీసీ ప్రసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

చిరంజీవి దంపతులతో

చిరంజీవి దంపతులతో

చిరంజీవి దంపతులను ఆహ్వానిస్తున్న రామోజీ రావు

రాజమౌళి దంపతులతో రాఘవేంద్రరావు

రాజమౌళి దంపతులతో రాఘవేంద్రరావు

రాజమౌళి దంపతులతో రాఘవేంద్రరావు

ఆలీ దంపతులు

ఆలీ దంపతులు

వివాహానికి హాజరైన ఆలీ దంపతులు

పెళ్లికి హాజరైన సాయికుమార్

పెళ్లికి హాజరైన సాయికుమార్

పెళ్లికి హాజరైన సాయికుమార్, ఆది

English summary
Eenadu group Chairman Ramoji Rao’s granddaughter Sahari's wedding was celebrated with grandeur at Ramoji Film City on Friday night. It surely had a lot of glitz and glamour with famous personalities from the film and political world gracing their presence.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu