Ramoji Rao: రామోజీరావుకు అన్ని వేల కోట్ల ఆస్తులు.. ఇప్పుడు అవన్నీ ఎవరికి సొంతం అవుతాయంటే!
సామాన్య వ్యాపారవేత్తగా ప్రయాణాన్ని మొదలు పెట్టి.. ఆ తర్వాత జర్నలిజం, సినిమా రంగంలోనూ తనదైన ముద్రను వేసుకున్నారు ప్రముఖ నిర్మాత రామోజీరావు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సినీ రంగానికి సేవలు అందించిన ఆయన.. ఈరోజు తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన గురించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు రామోజీరావు ఆస్తుల గురించిన వివరాలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌గా మారాయి. ఆ వివరాల గురించి తెలుసుకుందాం పదండి!
రామోజీరావు కన్నుమూత
దాదాపు ఐదు దశాబ్దాలకు పైగానే ఎన్నో రంగాల్లో తనదైన మార్కును చూపించిన దిగ్గజ నిర్మాత.. అనారోగ్యం కారణంగా శనివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఈ సీనియర్ నిర్మాత మరణంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి.

పరిశ్రమ మొత్తం నివాళి
ఎన్నో రంగాల్లో ప్రభావాన్ని చూపిన రామోజీరావు మరణంతో ముఖ్యంగా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. దీంతో ఆయన మరణంపై అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అలాగే, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే పలువురు పెద్ద స్టార్లు, ఇతర నటీనటులు రామోజీ పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు.
అలా ఎంట్రీ.. 950కి పైగా
సాధారణ వ్యాపారవేత్తగా ప్రయాణాన్ని మొదలుపెట్టిన రామోజీరావు.. 1984లో వచ్చిన 'శ్రీవారికి ప్రేమలేఖ' అనే చిత్రంతో నిర్మాతగా మారారు. అక్కడి నుంచి ఆయన ఎన్నో రకాల జోనర్లలో సినిమాలను నిర్మించారు. ఇలా ఇప్పటి వరకూ 85 చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. అందులో దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయని చెప్పాలి.
ఆస్తులు వేల కోట్లలోనే
వ్యాపారవేత్తగా, పత్రికా అధిపతిగా, నిర్మాతగా ఎన్నో పాత్రలను పోషిస్తూ గొప్ప వ్యక్తి అనిపించుకున్న రామోజీరావు పేరు ప్రఖ్యాతలు బాగానే వచ్చాయి. అదే సమయంలో ఆయన ఎన్నో విలువైన ఆస్తులను సైతం కూడగట్టుకున్నారు. ఇలా ఇప్పటి వరకూ రామోజీరావు పేరు మీద 46 వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు సినీ వర్గాల ద్వారా తెలిసింది.

అది మాత్రం గిన్నిస్‌లో
రామోజీరావు కెరీర్ మొదలెట్టిన కొత్తలోనే చాలా ప్రాంతాల్లో ఆస్తులు కూడగట్టుకున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో రామోజీ ఫిల్మ్ సిటీ పేరు మీద సినిమా స్టూడియోను నిర్మించారు. ఇది 1666 ఎకరాల విస్థీర్ణంలో ఉంది. దీని విలువ కూడా ఎన్నో కోట్ల రూపాయలు ఉంటుందని తెలిసింది. ముఖ్యంగా ఈ స్టూడియో గిన్నిస్ రికార్డు అందుకుంది.
అస్తులన్నీ వాళ్ల పేరిట
రామోజీరావుకు నికర ఆస్తులు వేల కోట్ల విలువలో ఉన్నట్లు తెలిసింది. అందులో ఇద్దరు కొడుకులకు సమానంగా కొంత భాగాన్ని పంచేశారట. మిగిలిన ఆస్తులను మాత్రం తన భార్య పేరు మీదనే ఉంచుకున్నారని తెలిసింది. ఇప్పుడు వాటికి సంబంధించిన అధికారం భార్య పేరిట ఉన్నా.. తర్వాత తన సంతానానికే చెందేలా వీలునామా చేసినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











