'ఈనాడు' ట్రెండ్ సెట్టర్: వెంకీ

By Staff

నేటి సమాజంలో విధ్వంసం పెచ్చరిల్లుతోందనీ, ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య మానవుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడనే ఇతివృత్తంలో అలాంటి పరిస్థితిలో పోలీస్ వ్యవస్థ ఏవిధంగా స్పందించాలి ఈ రోజు పరిస్థితి ఏమిటి అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్లు 'ఈనాడు' చిత్రం రూపొందిందనీ హీరో వెంకటేష్ తెలిపారు. కమల్ హాసన్ తో కలిసి వెంకటేష్ నటించిన ఈ చిత్రం ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చక్రి తోలేటి దర్శకుడు. హిందీ 'ది వెన్స్ డే' రీమేక్ గా ఈ చిత్రం రూపొందింది. హైద్రాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో వెంకటేష్ సోమవారంనాడు ఆ విశేషాలను ముచ్చటించారు. కమల్ తో నటించడం గ్రేట్ ఫీలింగ్..

జాతీయ నటుడు కమల్ హాసన్ వంటి గ్రేట్ ఆర్టిస్టుతో నటించడం మరపురాని అనుభూతినిచ్చింది. ఆయన నటించిన 'క్షత్రియ పుత్రుడు', 'నాయకుడు', 'స్వాతిముత్యం' పలు చిత్రాలు నన్నెంతో ఆకట్టుకోవడంతో పాటు ఆయన చేసిన పలు పాత్రలు నాకు స్ఫూర్తిగా నిలిచాయి. 'దశావతారం' చిత్రాన్ని చూసినప్పుడు మనం ఎక్కడున్నామని అనిపించింది. ఇలా ఎన్నో గొప్ప గొప్ప పాత్రలను అవలీలగా చేసి మెప్పించిన అద్భుత నటుడాయన. దశావతారం చిత్రం తర్వాత వస్తున్న 'ఈనాడు'లో నన్ను నటించమని ఆయన అడిగినప్పుడు చాలా ఆనందం కలిగింది. ఆయనతో కలిసి నటించడం ఎవరికైనా గొప్ప అనుభూతే. పాత్ర కూడా నచ్చే సినిమా చేశాను. తమిళంలో కూడా నటిస్తే బాగుంటుందని అనిపించింది. ఇందులో కమల్, నేనూ కలిసి నటించిన సన్నివేశాలు ఒకటి రెండే ఉంటాయి. ఇందులో పాటలు, ఫైట్స్ ఉండవు. ప్రేక్షకుడు రెప్పార్పకుండా చూనే ఎమోషన్స్ వుంటాయి. ఒక ప్రయోగాత్మకమైన కమర్షియల్ చిత్రం ఇది అని తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X