ఎన్టీఆర్ సరసన తెలుగమ్మాయి.. అందుకోసమే ఛాన్స్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం అరవింద సమేత వీర రాఘవ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా ఫస్ట్ లుక్ విడుదలైన సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ ని సిక్స్ ప్యాక్ లుక్ లో చూపించి త్రివిక్రమ్ అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
ఫస్ట్ లుక్ తో ఈ చిత్రం అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన డీజే బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ కూడా ఈ చిత్రంలో అవకాశం ఉందట. అందుకోసం త్రివిక్రమ్ తెలుగమ్మాయి ఇషా రెబ్బని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆ పాత్ర తెలుగు బాగా మాట్లాడే హీరోయిన్ కావాలని త్రివిక్రమ్ భావించాడట. అందుకే ఈషా రెబ్బాని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

అమీ తుమీ, అ! వంటి చిత్రాలతో ఈషా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. హారిక అండ్ హాసిని బ్యానర్ లో చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో రెండు వైవిధ్యాలు ఉంటాయని సమాచారం.


Click it and Unblock the Notifications











