అరవింద సమేత హీరోయిన్ ఒంటి రంగు గురించి కామెంట్.. ఎలా తిప్పికొట్టిందో తెలుసా!

Recommended Video

Eesha Rebba Gives Strong Counter To Fan

తెలుగమ్మాయిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇషా రెబ్బ నెమ్మదిగా విజయాల బాట పడుతోంది. ఇషా రెబ్బ నటనకు అద్భుతమైన స్పందన వస్తోంది. పాత్రలని ఎంచుకోవడంలో ఇషా రెబ్బ పరిణితి కనబరుస్తున్న సంగతి తెలిసిందే. అందుకే కమర్షియల్ హీరోయిన్ గా కంటే నటిగా ఇషా మంచి మార్కులు కొట్టేస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో ఇషా అభిమానులతో సరదాగా ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ అభిమాని ఇషా ఒంటి రంగు గురించి మాట్లాడాడు. అతడికి ఇషా అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.

అరవింద సమేత చిత్రంలో

అరవింద సమేత చిత్రంలో

అరవింద సమేత చిత్రంలో ఇషా రెబ్బ సెకండ్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో ఇషా సంతోషంలో ఉంది. అమీ తుమీ, అ! వంటి చిత్రాల్లో ఇషా పోషించిన పాత్రలకు అద్భుతమైన స్పందన లభించింది.

మీరు ఇంకొంచం కలర్ ఉంటే

మీరు ఇంకొంచం కలర్ ఉంటే


ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో ఇషా ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ అభిమాని.. మీరు ఇంకొంచెం కలర్ ఉంటే తిరుగుండేది కాదు అని కామెంట్ చేశాడు. అతడి కామెంట్ కు ఇషా రెబ్బ ధీటుగా సమాధానం ఇచ్చింది.

హీరోలు ఎలా ఉన్నా పర్వాలేదు

హీరోలు ఎలా ఉన్నా పర్వాలేదు

ఇషా అతడికి సమాధానం ఇస్తూ.. ఎందుకండీ ఈ కలర్ పిచ్చి. నాకు ఉన్న కలర్ తో నేను సంతోషంగా ఉన్నాను. హీరోలు ఎలా ఉన్నా పర్వాలేదు. కానీ హీరోయిన్ మాత్రం తెల్లగా ఉండాలి. హీరోయిన్లు మన నేటివిటీకి దూరంగా తెల్లగా ఉంటేనే ఇష్టపడతారా అంటూ ఇషా ప్రశ్నించింది.

అవకాశాలు అందుకుంటూ

అవకాశాలు అందుకుంటూ

ఇషా రెబ్బ వెంట వెంటనే సినిమాలు చేయకున్నా మంచి సబ్జెక్టు ఉన్న చిత్రాల్ని ఎంపిక చేసుకుంటోంది. ప్రస్తుతం ఇషా సుమంత్ సరసన సుబ్రమణ్యపురం చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నవంబర్ లో విడుదలకు సిద్ధం అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X