చిన్నదైనా, పెద్దదైనా అందులో తేడా ఉండదు: అనుష్క
హైదరాబాద్ : చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సినిమాలో విషయం ఉన్నప్పుడే సినిమా సక్సెస్ అవుతుందని, ఏ సినిమాకైనా ఆర్టిస్టులు ఒకే విధంగా కష్ట పడతారని హాట్ బ్యూటీ అనుష్క చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఇండస్ట్రీలో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే బేధం లేదు. ఏ సినిమా కోసమైనా ఆ టీం అంతా ఎంతో కష్టపడి పని చేస్తారు, నేను ఒక్క 'అరుంధతి' సినిమాకే ఎక్కువ కష్టపడి ఉంటాను అని అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ నేను నా మొదటి సినిమా 'సూపర్' నుంచి ఇప్పటి వరకూ ప్రతి సినిమాకి అంతే కష్టపడి అంకిత భావంతో పనిచేస్తానని అనుష్క వెల్లడించారు.
ప్రస్తుతం అనుష్క నటించిన 'డమరుకం', 'శివ తాండవం' చిత్రాలు ఈ నెలలో విడుదలకు సిద్ధం అవుతున్నాయి. విక్రమ్, జగపతి బాబు హీరోలుగా తేజ సినిమా బేనర్‌పై విజయ్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన చిత్రం 'శివ తాండవం'. నాగార్జున, అనుష్క జంటగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై డా.వెంకట్ నిర్మించిన చిత్రం 'డమరుకం'.
ప్రస్తుతం అనుష్క తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదు. గతంలో కమిట్ అయిన ప్రభాస్ సినిమా 'వారధి'(వర్కింగ్ టైటిల్)లో మాత్రమే నటిస్తోంది. అసలు అనుష్క హైదరాబాద్ రావడమే మానేసింది. ఢమకురం ఆడియో ఫంక్షన్‌కు అనుష్క గైర్హాజరైంది. శివతాండవం ఆడియో రిలీజ్‌కూ దూరంగానే ఉంది. అనుష్క ఎందుకు హైద్రాబాద్ రావడం లేదు. తెలుగు సినిమాలకు కావాలనే దూరంగా ఉంటోందా? తను నటించిన రెండు సినిమాల ఆడియో వేడుకలకు ఎందుకు గైర్హాజరైంది? దీనికి బిజీ ఒకటే కారణమా? ఇంకేదైనా ఉందా? ఇది ఇప్పుడు ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications











