హాట్ బ్యూటీకి రెండేళ్ల జైలు: ఆ వీడియోలో సెక్సీగా కనిపించడం వల్లే...
Recommended Video

సినిమాల్లో, మ్యూజిక్ వీడియోల్లో అందాలు ఆరబోయడం అనేది సర్వ సాధారణం. అయితే తాజాగా ఓ సింగర్ తన మ్యూజిక్ వీడియోలో అందాల ఆరబోత శృతిమించి చేసిందనే ఆరోపణలతో రెండేళ్ల జైలు శిక్షకు గురైంది. ఈ విషయం తెలిసి పాప్ సంగీత ప్రపంచం నివ్వెర పోయింది.

సింగర్ పేరు షైమా అహ్మద్
పాప్ సింగర్, హాట్ బ్యూటీ షైమా అహ్మద్‌కు ఈజిప్టులోని ఓ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. సదరు వీడియోలో ఆమె అసభ్యంగా, జుగుప్సాకరంగా కనిపించిందని, ఇలాంటి వాటిని సహించబోమంటూ శిక్ష ఖరారు చేశారు.

వీడియోలో ఏముంది?
క్లాస్ రూమ్ థీమ్ తో రూపొందించిన ఈ వీడియోలో షైమా అహ్మద్ లో దుస్తులు ధరించి సెక్సీగా అందాలు ఆరబోస్తూ యాపిల్స్, అరటిపండ్లు ప్రదర్శిస్తూ సెక్సువల్ ఇంటెన్సన్ కలిగేలా నటించింది. ఈ వీడియో చూసిన ఈజిప్టియన్లు ఇందులో బూతు కంటెంట్ ఎక్కువ ఉందంటూ ఫిర్యాదు చేయడం మొదలు పెట్టారు.

కేసు పెట్టిన పోలీసులు
షైమా అహ్మద్ వీడియోపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పోలీసులు ఆమెపై కేసు పెట్టారు. ఈ వీడియో వివాదం ఈజిప్ట్ మీడియాలోసంచలనం అయింది. తన వీడియో పట్ల ఆమె క్షమాపణలు చెప్పినా ఫలితం లేక పోయింది.

సమాజంలోకి చెడు సంకేతాలు
షైమా అహ్మద్ విడుదల చేసిన వీడియో వల్ల సమాజంలోకి చెడు సంకేతాలు వెలుతున్నాయని, ఇలాంటి మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే శిక్ష పడాల్సిందే అంటూ... కోర్టు ఆమెకు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
వివాదానికి కారణమైన వీడియో ఇదే
వివాదానికి కారణమైన వీడియో ఇదే. ఇలాంటి సెక్సీ వీడియోలు చేస్తూ షైమా అహ్మద్ అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయింది. ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా లక్షల్లో ఉంది.


Click it and Unblock the Notifications