'ఏక్ నిరంజన్' రిలీజ్ డేటు
ప్రభాస్, కంగనా రనౌత్ హీరో,హీరోయిన్స్ గా రూపొందిన 'ఏక్ నిరంజన్" చిత్రం అక్టోబర్ 29న రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.ఆదిత్యారామ్ మూవీస్ పతాకంపై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆదిత్యారామ్ నిర్మిస్తున్నఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత ఆదిత్యారామ్ మాట్లాడుతూ "సెప్టెంబర్ 17తో ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి.ఈ నెలలోనే ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల చేసి అక్టోబర్ 29న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.
అలాగే సినిమా చాలా బాగా వచ్చింది.థాయ్‌లాండ్‌లో 20రోజుల పాటు చిత్రీకరించిన క్లైమాక్స్‌లో మన ఇండియన్ ఫైటర్స్‌తో పాటు యూరప్ ఫైటర్స్ కూడా పాల్గొన్నారు. అలాగే హాలీవుడ్ హీరో జాకీచాన్‌తో సోలో ఫైట్‌లో పాల్గొన్న ఫైటర్ కూడా ఈ క్లైమాక్స్‌లో పాల్గొనడం విశేషం.అత్యధిక వ్యయప్రయాసలతో చిత్రీకరించిన క్లైమాక్స్ సినిమాకే హైలైట్ అవుతుంది. ఈ సినిమా ద్వారా తెలుగులో పరిచయం అవుతున్న కథానాయిక కంగనా రనౌత్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కానుంది. బ్రహ్మానందం, ఆలీలపై చిత్రీకరించిన కామెడీ మరో హైలైట్ అవుతుంది" అన్నారు.


Click it and Unblock the Notifications











