‘మగధీర’ తర్వాత మోగుతోందిదే!!
పాటలు విడుదలైనప్పుడు పెద్దగా లేవనిపించినా, తర్వాత నెమ్మదిగా అందలం ఎక్కేసి, సినిమా సంచలన విజయం సాధించడంతో 'మగధీర" పాటలు ఆడియో మార్కట్ ని శంఖారావం మోగించాయి. ముఖ్యంగా 'పంచదార బొమ్మా" పాట ఈ ఏడాదిలో అత్యధికంగా డౌన్ లోడ్ అయిన కాలర్ ట్యూన్, రింగ్ టోన్ గా రికార్డ్ నెలకొల్పింది. ఎఫ్ఎంలోనూ అత్యధికంగా శ్రోతలు కోరిన పాట ఇదే.
ఇప్పుడు దాదాపు అదే స్థాయిలో సంగీత ప్రియులని ఉర్రూతలూగిస్తోంది 'ఏక్ నిరంజన్" టైటిల్ సాంగ్. మణిశర్మ స్వరకల్పనలో రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట సంగీత, సాహిత్యాల పరంగా స్కోర్ చేసి సంగీత ప్రియులని మేనియాలా పట్టేసింది. ఈ పాటొక్కటే 'ఏక్ నిరంజన్" ఓపెనింగ్స్ ని రెండింతలు చేసేలా వుందంటే అతిశయోక్తి లేదు. ఆల్రెడీ వినేసి వుంటే ఈ సంగతి మీకూ తెలిసే వుంటుంది. మరి వినకపోతేనో ఇంకా లేటెందుకండీ? ఎలా వుందో రిప్లే ఇవ్వండి.
మగధీర రామ్ చరణ్ ప్రభాస్ ఎంఎం కీరవాణీ ఏక్ నిరంజన్ మణిశర్మ magadheera ram charan tej mm keeravani ek niranjan prabhas manisharma


Click it and Unblock the Notifications