ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్
ప్రభాస్, పూరీ కాంబినేషన్లో రూపొందిన ఏక్ నిరంజన్ చిత్రం అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని నిర్మాత ఆదిత్యారామ్ చెబుతూ ఇప్పటికే మణిశర్మ అందించిన సంగతం పెద్ద హిట్టయి మ్యూజిక్ చార్టులలో నెంబర్ వన్ పొజీషన్ లో ఉంది. ఇక ఆ పాటల చిత్రీకరించిన తీరు ప్రేక్షకులను మళ్ళీ మళ్ళీ ధియోటర్స్ కి రప్పిస్తుంది. ఇక ప్రభాస్ నటన గురించి చెప్పక్కర్లేదు అంటూ విశేషాలు చెప్పుకొచ్చారు.
ఇక ఈ చిత్రంలో ప్రభాస్ 'బౌంటీ హంటర్' గా కనిపిస్తాడు. అతను పోలీసుల కోసం పనిచేస్తుంటాడు. క్రిమినల్స్‌ని పట్టుకొచ్చి పోలీసులకు అప్పచెబుతుంటాడు. ఇక హీరోయిన్ గా చేసిన కంగనా గిటార్ టీచర్‌గా కనిపిస్తుంది. ఇప్పటిదాకా రియలిస్టిక్ సినిమాలే చేసిన ఆమెకు ఇదే తొలి పక్కా కమర్షియల్ సినిమా. ఇక ఈ చిత్రంలో సోనూసూద్,మార్కెండ్ దేస్ పాండే, ముకుల్ దేవ్, బ్రహ్మానందం, అలీ, సునీల్, వేణుమాధవ్, బ్రహ్మాజి, తణికెళ్ళ భరణి, సంగీత, పోసాని కృష్ణ మురళి మిగతా పాత్రల్లో చేసారు.


Click it and Unblock the Notifications











