'ఏకనిరంజన్' పాటలు అదుర్స్
ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ భామ కంగనా రనౌత్ హీరోయిన్ గా ఆదిత్యరామ్ మూవీస్ పతాకంపై పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఏక్ నిరంజన్'. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయనీ, ఈ మద్య హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో విడుదలైన ఆడియోకి మంచి స్పందన వస్తోందనీ నిర్మాత ఆదిత్యరామ్ తెలిపారు. ఈ చిత్రంలోని పాటలను పలు అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించామని, ఈ సినిమాలో మొదటి పాట'ఏక్ నిరంజన్" హీరో ఇంట్రడక్షన్ పాటగా మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన భారీ సెట్లో చిత్రీకరించామని ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయని తెలిపారు.
రెండో పాటను స్విట్జర్లాండ్ లో హీరోహీరోయిన్లపై చిత్రీకరించారమనీ, అనే మూడో పాటను హైద్రాబాద్ లోని డిఫరెంట్ లొకేషన్లలో తీశామనీ చెప్పారు. నాలుగో సాంగ్ అన్నపూర్ణా స్టూడియోస్ లోని ప్రత్యేక సెటల్ హీరో-హీరోయిన్-వెస్ట్రన్ డాన్సర్లపై చిత్రీకరించామని చెప్పారు. మణిశర్మ సంగీతం అందించిన పాటలు పెద్ద హిట్ కావడంతో పాటు వీటన్నింటినీ డిఫరెంట్ ప్రదేశాల్లో చిత్రీకరించినట్టు ఆదిత్యరామ్ చెప్పారు. ఐదో పాటను హైద్రాబాద్ లో, చివరి పాటను ప్రపంచ ప్రఖ్యాత పాప్ కింగ్ మైకెల్ జాక్సాన్ కు నివాళిగా 'అరెరే..నర్తనతార' అనే పాటను చిత్రీకరించాం. పాటలతో పాటు ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని బావిస్తున్నాను. ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయుటకు సన్నాహాలు సిద్ద చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సోనూసూద్, ముకుల్ దేవ్, మకరన్ దేశ్ పాండే, బ్రహ్మానందం, ఆలీ, సునీల్, తనికెళ్ల భరణి, పోసాని తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











