నేను యాక్ట్ చేసిన ఏక్ సె బురే దొ సినిమా చెత్త అది..నా గతంలోని ఘోస్ట్ (దెయ్యం). నేను నా అభిమానులను నేను క్షమాపణ కోరుకుంటున్నాను...అంటున్నాడు నటుడు, హీరో అర్షద్ వార్శి. మొన్న శుక్రవారం రిలీజైన తన సినిమా వల్ల తన రిప్యుటేషన్ పోయిందని, ఆ సినిమా రిలీజ్ ఆపాలని శతవిధాలా ప్రయత్నించానని చెప్తున్నాడు. నిజానికి ప్రమేషన్ జరపాల్సిన సమయంలో ఇలాంటి స్టేట్ మెంట్స్ సినిమాకు పెద్ద దెబ్బ. అలాగే ఈ సినిమా ఒప్పుకోవటమే నేను చేసిన పెద్ద పొరపాటు..నా లైఫ్ లో ఎప్పుడూ ఇంత చెత్త సినిమాను కమిటవను. అట్లానే నా పెండింగ్ ప్రాజెక్టులు ఇలాంటివి ఉండకుండా జాగ్రత్తపడతాను. ఇక ఈ సినిమా దాదాపు ఐదేళ్ళ క్రిందట ప్రారంభమైంది. అప్పటికి అర్షద్ వార్శికి, మరో ముఖ్య పాత్ర చేసిన రాజ్ పాల్ యాదవ్ కి అవకాశాలు రావటమే గొప్ప. ఇలానిజాయితీగా మన హీరోలు కూడా చెప్పాలంటే నూటికి తొంభై సినిమాలుది అదే పరిస్ధతి.