అల్లుడి తడాఖా..! వివాదంలో సల్మాన్ ‘ఏక్ థా టైగర్’
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్-కత్రినా జంటగా నటిస్తున్న 'ఏక్ థా టైగర్' చిత్రం మరో వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రం మాజీ భారత గూఢాచారి రవీంద్ర కౌశిక్ జీవితం ఆధారంగా రూపొందిస్తున్నారు. ఇందులో సల్మాన్ రవీంద్ర కౌశిక్ పాత్రను పోషిస్తున్నారు. అయితే ఈ చిత్రంపై రవీంద్ర కైశిక్ మేనల్లుడు విక్రమ్ వశిష్ట అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర సెన్సార్ బోర్డుకు, ఫిల్మ్ ఫెడరేషన్‌కు లీగల్ నోటీసులు జారీ చేశారు.
తన మామ పాత్రను అభ్యంతరకరంగా చిత్రీకరించారనే అనుమానాలున్నాయని, సినిమా విడుదల ముందుగానే తనకు స్పెషల్ షో వేసి చూపించాలని విక్రమ్ డిమాండ్ చేస్తున్నారు. లేక పోతే సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటామని విక్రమ్ హెచ్చరించారు.
రవీంద్ర కౌశిక్ ఇండియా గూడచార సంస్థ RAW(Research Analysis Wing)తో కలిసి పని చేశారు. భారత్ గూఢచారిగా పాక్ వెళ్లిన ఆయన అక్కడి సైన్యంలో చేరారు. ఆ తర్వాత పట్టబడటంతో జైలుకెళ్లారు. ఆ తర్వాత చాలా ఏళ్లు పాక్ జైల్లో శిక్ష అనుభవించారు.
ఈ సినిమా ఇండియా గూఢచారి సంస్థ RAW, పాకిస్తాన్ గూఢచారి సంస్థ ISI ల నేపథ్యంలో రూపొందిందనీ, ఇందులో పాకిస్తాన్ ను విలన్ గా చిత్రీకరించారనీ, పాక్ అధికారుల అనుమానం. అందుకే, ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోలను అక్కడి టీవీలలో ప్రసారం కాకుండా ఆ మధ్య నిషేధించారు.
'ఏక్ థా టైగర్' చిత్రం ఆగస్టు 15 తేదిన విడుదలకు సిద్ధమౌతోంది. రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలైంది. ఈచిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తుండగా, ఆదిత్య చోప్రా నిర్మించారు.


Click it and Unblock the Notifications











