మహేష్ సినిమాకు...ఏక్ థా టైగర్ ఫైట్ మాస్టర్
హైదరాబాద్ : 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. క్రితి సానన్ హీరోయిన్. మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించి తాజాగా అందిన ఆసక్తికర సమాచారం ఏమిటంటే....బాలీవుడ్ మూవీ 'ఏక్ థా టైగర్'కు అద్భుతమైన ఫైట్స్ కంపోజ్ చేసిన హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కాన్రాడ్ పాల్మిశానో 'మహేష్ బాబు-సుకుమార్' సినిమాకు పని చేయబోతున్నారు. ఈ విషయాన్ని పిఆర్‌ఓ బిఎ రాజు తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫైట్స్ చిత్రీకరిస్తున్నారని ఆయన చెప్పారు.
ఇతర వివరాల్లోకి వెళితే...సుకుమార్ తయారుచేసిన స్క్రిప్ట్ మహేష్ బాబుని బాగా ఇంప్రెస్ చేసిందని, ముఖ్యంగా ఆయన క్యారెక్టరైజేషన్ పూర్తి వైవిధ్యంగా వుండేలా సబ్జెక్ట్‌ను సుకుమార్ తీర్చిదిద్దాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం కోసం మహేష్ బాబు కొత్త లుక్ తో చూపెట్టనున్నారు.
ఈ చిత్రంలో షాయాజీ షిండే, కిల్లి దోర్జీ, విక్రమ్ సింగ్, శ్రీనివాస్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సాంకేతిక వివరాల్లోకి వెళితే... ఈ చిత్రానినికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు, స్టూడియో: 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ -స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్.


Click it and Unblock the Notifications











