twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తమిళ మగధీర ('ఏకవీర 'ప్రివ్యూ)

    By Srikanya
    |

    'మృగం', 'వైశాలి' చిత్రాలతో తెలుగు వారికి పరిచయమైన ఆది పినిశెట్టి హీరోగా నటించిన తమిళ చిత్రం ఆరవాన్ ఈ రోజు(శుక్రవారం)'ఏకవీర'టైటిల్ తో విడుదల అవుతోంది. పద్దెనిమిదో శతాబ్ద కాలం నాటి సమాజం, పతనం అంచుకు చేరుతున్న అప్పటి రాచరిక వ్యవస్థనీ మలిచి తీసిన ఈ చిత్రాన్ని దక్షిణాపథంలో జరిగిన యథార్థ గాథగా చెప్తున్నారు. బానిసత్వం మీద సామాన్యులు జరిపిన పోరాటాన్నీ, దొంగల ముఠాల మధ్య ఆధిపత్య పోరునీ ఈ చిత్రం చూపిస్తుంది. ఎస్. వెంకటేశ్ రాసిన చారిత్రిక నవలను దర్శకుడు వసంతబాలన్ ఈ చిత్రంగా తెరకెక్కించారు.

    రాజుగా నటించిన విజయచందర్ మినహా మరెవరికీ కాళ్లకు చెప్పులుండవు. ఒంటిపై చొక్కాలుండవు. అయినా మండుటెండల్లో, ఎంతో అంకితభావంతో అందరూ తమ పాత్రలకు న్యాయం చేసేందుకు కష్టపడి చేసిన చిత్రం ఇది. బొబ్బిలి, తలకోన, హంపి వంటి ప్రదేశాల్లో వేసిన సెట్లలో ఎన్నో వ్యయప్రయాసలతో ఈ చిత్రాన్ని తీశారు. ఎ.ఆర్. రెహమాన్ శిష్యుడు కార్తీక్ సంగీత దర్శకునిగా పరిచయమవుతూ భారతీయ వాయిద్య పరికరాలతో కూర్చిన పాటలు ఇప్పటికే మంచి టాక్ తెచ్చుకున్నాయి. ఈ చిత్రం గురించి నిర్మాత బాబీ మాట్లాడుతూ....ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్నీ, అనుభూతినీ ఇచ్చే సినిమా 'ఏకవీర'. సినిమా మొదలైన ఐదు నిమిషాల్లో మనం 18వ శతాబ్దిలోకి వెళ్లిపోతాం. సినిమా అంతా అయ్యాక తిరిగి మరో లోకంలోకి వచ్చినట్లు ఫీలవుతాం. అంతగా మనల్ని ఇన్‌వాల్వ్ చేస్తుంది ఈ చిత్రం అన్నారు.

    నటీనటులు : ఆది, దన్సిక, అర్చనాకవి, అంజలి,పశుపతి, విజయచందర్ తదితరులు
    సంగీతం : కార్తీక్
    పాటలు :అనంతశ్రీరామ్
    సినిమాటోగ్రఫీ:సిద్ధార్థ్
    దర్శకత్వం: వసంతబాలన్
    నిర్మాత: శ్రీనివాస్ దామెర
    నిర్మాణ నిర్వాహకుడు: బాబి

    English summary
    Eka veera (2012)Telugu film is a historical film that deals with the story of some incidents that occurred in 18th century in South India.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X