సెక్స్ సీన్స్ లో చేయమని తమ్ముడుని ఒత్తిడిచేస్తున్న నిర్మాత అక్క
విద్యాబాలన్ ప్రధానపాత్రలో సిల్క్ స్మిత జీవితం ఆధారంగా డర్టీ పిక్చర్ అనే చిత్రం త్వరలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని బాలాజీ టెలి ఫిలిమ్స్ అధినేత్రి ఏక్తా కపూర్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ఆమె తమ్ముడు తుషార్ కపూర్ ను కూడా ఓ కీలకమైన పాత్రను పోషించటానకి ఒప్పించింది. అయితే ఆ పాత్ర ..సిల్క్ స్మితను సెక్స్ వల్ గా ఎక్సప్లాయిట్ చేసిన ఓ సౌత్ ఇండియన్ నటుడు రియల్ లైఫ్ ని పోలి ఉంటుంది. దాంతో తుషార్ కీ,విద్యాబాలన్ కీ మధ్య కొన్ని సెక్స్ సీన్స్ ఉన్నాయి. అయితే ఇప్పటివరకూ అలాంటి పాత్రలు చేయని తుషార్ తాను ఆ సీన్స్ లో చేయలేనని చేతులెత్తేసాడు.
దాంతో ఏక్తా కపూర్ ప్రత్యేకందా తన తమ్ముడికీ, విద్యాబాలన్ కీ వర్క్ షాప్ నిర్వహించి ఆ లవ్ సీన్స్ బాగా వచ్చేలా ప్లాన్ చేయమని దర్శకుడుని పురమాయించిందని బాలీవుడ్ కథనం. ఇందులో నసీరుద్దీన్ షా.. విద్యాబాలన్ ని వివాహం చేసుకునే నిర్మాతగా కనిపించనున్నారు. ఎక్కువ భాగం చెన్నైలోనూ, ముంబైలోని కొన్ని స్టూడియోల్లోనూ షూట్ చేస్తారు. మిలన్ లుథ్రియా దర్శకత్వంలో రూపొందనున్నఈ 'ది డర్టీ పిక్చర్' చిత్రం కోసం విధ్యాబాలన్ ఆ మధ్య పశ్చమ గోదావరి జిల్లా ఏలూరు వచ్చి వెళ్ళింది. అజయ్ దేవగన్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











