సిల్మ్‌స్మిత సోదరుడికి ఎక్తా కపూర్ రిప్లయ్
సిల్మ్ స్మిత జీవితం ఆధారంగా ఎక్తా కపూర్ 'డర్టీ పిక్చర్" సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో తన సోదరిని కించపరిచే, ఆమెను వల్గర్ గా చూపిస్తూ సన్నివేశాలు చిత్రీకరించారని, వెంటనే సినిమా విడుదలను నిలిపి వేయాలని కోరుతూ....సిల్మ్ స్మిత సోదరుడు వడ్లపట్ల నాగవర్మ ప్రసాద్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై రెస్పాండ్ అయిన ఎక్తాకపూర్ తనదైన శైలిలో రిప్లయ్ ఇచ్చింది. నాగవర్మ ప్రసాద్ వేసిన పిటీషన్ కు ప్రతి దేశ వ్యాప్తంగా దాదాపు 20 నగరాల్లో పటీషన్లు దాఖలు చేశారు. ఎవరినీ కించ పరిచే ఉద్దేశ్యంతో సినిమా తీయలేదని, కేవలం వినోదాత్మక కోణంలోనే సినిమా ఉంటుందని, తమ సినిమాను నిలుదల చేయాలనడం సబబు కాదని అందులో పేర్కొన్నారు.
డర్టీ పిక్చర్ చిత్రంలో హీరోయిన్ విద్యా బాలన్ సిల్మ్ స్మిత పాత్రను పోషిస్తుండగా, నసిరుద్దీన్ షా, ఇమ్రాన్ హస్మి, తుషార్ కపూర్ లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మిలన్ లుథ్రియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శోభ కపూర్, ఎక్తాకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సిల్మ్ స్మిత పుట్టిన రోజైన డిసెంబర్ 2న 'డర్టీ పిక్చర్" సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











