సినిమాగా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ జీవితం
ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 50 ఏళ్ల అజహర్ జీవితంలో సినిమా కథకు కావాల్సిన మలుపులెన్నో ఉన్నాయి. సామాన్య కుటుంబం నుంచి భారత క్రికెట్ కెప్టెన్‌గా ఎదిగిన ఈ హైదరాబాదీ.. ఆపై మ్యాచ్‌ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అజహర్ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
అంతర్జాతీయ క్రికెట్‌లో 99 టెస్ట్ మ్యాచ్‌లు 300 వన్డే మ్యాచ్‌లకు పైగా ఆడిన అజారుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో 2000 సంవత్సరం నుంచి క్రికెట్ దూరమైన సంగతి తెలిసిందే. ఈ చిత్ర నిర్మాణంపై వచ్చిన వార్తలపై ఏక్తా కపూర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం మరింత బలం చేకూరింది. కాగా చిత్రాన్ని నిర్మించేందుకు ఏక్తా మరింత వేగం పెంచినట్టు తెలుస్తోంది.
అజహర్ బయోగ్రఫీ ఆధారంగా నిర్మించబోయే చిత్రానికి హక్కులను ఇప్పటికే సొంతం చేసుకోవడం కూడా జరిగినట్టు తెలుస్తోంది.. ఉత్తర ప్రదేశ్ నుంచి మొరాదాబాద్ ఎంపీగా కొనసాగుతున్న అజారుద్దీన్‌తో నిర్మాత ఇటీవల అగ్రిమెంట్ కూడా జరిగినట్టు తెలిసింది. త్వరలోనే ఈ చిత్ర నిర్మాణంపై ఓ ప్రకటన వెలువడనుందని ఏక్తా సన్నిహితులు వెల్లడించారు.
ఈ చిత్రంలో సైఫ్ ఆలీ ఖాన్, రణ్‌బీర్ కపూర్, రణ్‌వీర్ సింగ్ పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దక్షిణాది తార సిల్క్ స్మిత జీవిత కథను తెరకె క్కించి హిట్ సాధించిన ఏక్తా.. అజర్‌పై చిత్రాన్ని రూపొందించి హిట్ కొడుతుందో లేదో వేచి చూడాల్సిందే అంటన్నారు.


Click it and Unblock the Notifications












