పోలీసులనే...మోసం చేసిన లేడీ నిర్మాత, దర్శకుడు
పోలీసులను మోసం చేశారన్న ఆరోపణలతో బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్, దర్శకుడు సంజయ్ గుప్తాలపై చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదైంది. 'షూటౌట్ ఎట్ వడాలా' చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం ముంబై నగర పోలీస్ కమీషనర్ లెటర్ ప్యాడ్‌ను, రబ్బర్ స్టాంప్‌ను ఫోర్జరీ చేసి మోసానికి పాల్పడిన సంఘటనలో వీరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి నందకుమార్ తెలిపారు.
'షూటౌట్ ఎట్ వడాలా' చిత్రానికి సంజయ్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ఏక్తా కపూర్, సంజయ్ గుప్తా, శోభా కపూర్ సంయుక్తంగా బాలాజీ టెలి ఫిలింస్, వైట్ ఫీచర్ ఫిలింస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ కపూర్, జాన్ అబ్రహం, కంగన రనౌత్, తుషార్ కపూర్, సోనూసూద్ ఈచిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రీతమ్, విశాల్ శేఖర్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సంవత్సరం డిసెంబర్ 7న ఈ చిత్రం విడుదల చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












