For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెక్స్‌తో నాకు సమస్య లేదు.. నిషేధిస్తే ఇంకా ప్రమాదం.. ఏక్తా కపూర్

    |
    Ekta Kapoor On Demand To Regulate Digital Content || Filmibeat Telugu

    నెట్‌ఫ్లిక్ష్, అమెజాన్ ప్రైమ్‌ లాంటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలలో అసభ్యకరమైన కంటెంట్ పెద్ద ఎత్తున్న ప్రసారం చేస్తున్న నేపథ్యంలో వాటిపై పర్యవేక్షణ, నియంత్రణ ఉండాలని బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ అభిప్రాయపడ్డారు. స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాంలపై నియంత్రణ ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాంపై సెన్సార్‌షిప్ విధించాలన్న డిమాండ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీ ఫ్లాట్‌ఫాం ఏఎల్‌టీ బాలాజీ ఇటీవల వెబ్‌లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

    అడల్ట్ కంటెంట్‌పై నిషేధమా?

    అడల్ట్ కంటెంట్‌పై నిషేధమా?

    సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నిర్మాత ఏక్తా కపూర్ స్పందిస్తూ. అసభ్య, పెద్దలకు మాత్రమే కంటెంట్‌ను నిషేధిస్తే చాలా ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం విషాదకరమైన పరిస్థితి నెలకొని ఉంది. కానీ నియంత్రణ అనేది ఉండాలి. చాలా మంది మీరు అంతా బోల్డ్‌గా ఉంటారనే ప్రశ్న వేస్తారు. కానీ నాకు సెక్స్ అనే దానితో ఎలాంటి సమస్య లేదు అని ఏక్తా కపూర్ పేర్కొన్నారు.

    మంచి, చెడు రెండు ఉన్నాయని

    మంచి, చెడు రెండు ఉన్నాయని

    అసభ్య, అశ్లీల, అడల్ట్ కంటెంట్ చిత్రాల్లో నటించే వాళ్లకు, చూసే వాళ్లకు ఇబ్బంది లేనప్పుడు నిషేధించాల్సిన అవసరం లేదు. కాకపోతే సెన్సార్‌షిప్ ఉండాలి. ఈ కంటెంట్ విషయంలో మంచి, చెడు రెండు ఉన్నాయి. చట్టబద్దంగా ఉండే పెళ్లిలో కూడా నేరాలు జరగడం చూస్తున్నాం. నేరాలకు సెక్స్ కారణం కాదు అని ఏక్తా కపూర్ తెలిపారు.

    అణిచి వేస్తే ఇంకా ప్రమాదం పొంచి

    అణిచి వేస్తే ఇంకా ప్రమాదం పొంచి

    సుప్రీంకోర్టు ఆదేశాలపై స్పందిస్తూ.. మనం నిర్ణయంతో పనిలేదు. నిర్ణయం, అభిప్రాయం వెల్లడించడానికి మనకేం అవసరం. మన సమాజంలో దేనిపైనైనా నిషేధం విధిస్తే దానికి ఇంకా క్రేజ్, డిమాండ్ పెరుగుతుంది. అది మానవ నైజం అని ఏక్తా కపూర్ అన్నారు. అడల్ట్ కంటెంట్‌ను నిషేధిస్తే ఇంకా ప్రమాధం ఉంటుంది అని ఏక్తా కపూర్ వెల్లడించారు.

    మాస్ ఆడియెన్స్‌కు చేరువయ్యేలా

    మాస్ ఆడియెన్స్‌కు చేరువయ్యేలా

    ఏఎల్‌టీ బాలాజీలో చాలా మంచి కంటెట్ పెడుతున్నాం. ఆర్బన్ ఆడియెన్స్, మాస్ ఆడియెన్స్‌కు చేరువయ్యేలా ప్రయత్నిస్తున్నాం అని ఏక్తా కపూర్ అన్నారు. వెబ్ మీడియానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. కవాచ్, బేపనా ప్యార్ లాంటి సీరియల్స్ క్రేజీగా సాగుతున్నాయి. మున్ముందు వెబ్ సిరీస్, ఇతర కార్యక్రమాలను పెంచేందుకు ప్రయత్నిస్తాం. మారుతున్న కాలానికి, ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా మార్పులు తీసుకొస్తాం అని ఏక్తా కపూర్ తెలిపారు.

    English summary
    Producer Ekta Kapoor is not in favour of regulating streaming platforms as she believes it will only create a bigger need for unregulated content. The SC has sought the government's response on a plea to regulate streaming platforms like Netflix and Amazon Prime.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X