ఆర్ నారాయణ మూర్తిపై కోడ్ వేటు

టైటిల్ సమస్యే సినిమా పరాజయానికి కారణమని నిర్ణయించుకున్న నారాయణమూర్తి 'కూతురి కోసం'అంటూ పేరు మార్చి, ఓ పాట కలిపి రీ సెన్సార్ చేయించి సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం క్షురకుల సమస్యలను తెరపై తెచ్చే ప్రయత్నం చేసింది. అలాగే సంచలనం సృష్టించిన ఆయేషా హత్య కేసుని ఆధారం చేసుకుని కూడా కొన్ని సన్నివేశాలు రూపొందించారు. ఆర్.నారాయణమూర్తి, గోగినేని ప్రసాద్, కృష్ణేశ్వరరావు, బాలు మహేంద్ర, ప్రియాంక, ప్రధాన పాత్రల్లో చేసిన ఈ చిత్రకి మాటలు కృష్ణేశ్వరరావు, పాటలు వంగపండు ప్రసాదరావు, గోరంట్ల వెంకన్న, అశోక్ తేజ తదితరులు, సంగీతం వందేమాతరం, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత ఆర్.నారాయణమూర్తి. మరి ఈ సారన్నా ఈ చిత్రం హిట్టవ్వాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











