twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆర్ నారాయణ మూర్తిపై కోడ్‌ వేటు

    By Staff
    |

    R Narayana Murthy
    ప్రముఖ దర్శక, నిర్మాత ఆర్‌ నారాయణమూర్తి నటించి, నిర్మించిన 'కూతురి కోసం' చిత్రంపై కోడ్‌ వేటు పడింది. వచ్చే నెల ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో..కొన్ని రాజకీయ పార్టీలపై వ్యాఖ్యలు, వాటి గుర్తులు ఉపయోగించుకోవడంపై ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. వాటిని తొలగించాలని ఆదేశించింది. నారాయణమూర్తి మంగళవారం సచివాలయంలోని ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో స్క్రీనింగ్‌ కమిటీ వద్ద హాజరయ్యారు. ఈసీ సూచనలకు ఆయన అంగీకరించారు. ఇంతకు ముందు ఈ కూతరు కోసం చిత్రాన్ని దేవరకొండ వీరయ్య పేరుతో నారాయణ మూర్తి రిలీజ్ చేసారు. అయితే ఆ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

    టైటిల్ సమస్యే సినిమా పరాజయానికి కారణమని నిర్ణయించుకున్న నారాయణమూర్తి 'కూతురి కోసం'అంటూ పేరు మార్చి, ఓ పాట కలిపి రీ సెన్సార్ చేయించి సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం క్షురకుల సమస్యలను తెరపై తెచ్చే ప్రయత్నం చేసింది. అలాగే సంచలనం సృష్టించిన ఆయేషా హత్య కేసుని ఆధారం చేసుకుని కూడా కొన్ని సన్నివేశాలు రూపొందించారు. ఆర్.నారాయణమూర్తి, గోగినేని ప్రసాద్, కృష్ణేశ్వరరావు, బాలు మహేంద్ర, ప్రియాంక, ప్రధాన పాత్రల్లో చేసిన ఈ చిత్రకి మాటలు కృష్ణేశ్వరరావు, పాటలు వంగపండు ప్రసాదరావు, గోరంట్ల వెంకన్న, అశోక్ తేజ తదితరులు, సంగీతం వందేమాతరం, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత ఆర్.నారాయణమూర్తి. మరి ఈ సారన్నా ఈ చిత్రం హిట్టవ్వాలని కోరుకుందాం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X