‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రానికి ఎలక్షన్ కమీషన్ గ్రీన్ సిగ్నల్...

Recommended Video

Lakshmi's NTR Got Green Signal From Election Commission | Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న 'లక్ష్మిస్ ఎన్టీఆర్' చిత్రానికి ఎన్నికల సంఘం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ విషయాన్ని నిర్మాత రాకేష్ రెడ్డి అఫీషియల్‌గా ప్రకటించారు. ఈసీ విచారణకు స్వయంగా హాజరైన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు.

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును విలన్‌గా చూపించి ఎన్నికల్లో దెబ్బతీయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాకేష్ రెడ్డి.. రామ్ గోపాల్ వర్మతో ఈ సినిమా తీయించాడని, ఎన్నికల ముందు విడుదల చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీని నష్టపరిచే కుట్ర జరిగిందని ఆ పార్టీకి చెందిన నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

సినిమాలో టీడీపీ గుర్తులు వాడలేదు

సినిమాలో టీడీపీ గుర్తులు వాడలేదు

విచారణకు హాజరైన రాకేష్ రెడ్డి ఎన్నికల అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ఎక్కడా కూడా తెలుగు దేశం పార్టీకి చెందిన ఎన్నికల గుర్తులు కానీ, పార్టీ సింబల్ కానీ చూపించలేదని తెలిపారు. కేవలం పసుపు రంగు జెండాల మాత్రమే వాడటం జరిగిందని వివరణ ఇచ్చారు.

రిలీజ్ తర్వాత అభ్యంతరాలుంటే..

రిలీజ్ తర్వాత అభ్యంతరాలుంటే..

అభ్యంతరాలు ఏమైనా ఉంటే సినిమా విడుదలైన తర్వాత కూడా మళ్లీ వచ్చి ఎన్నికల కమీషన్‌కు వివరణ ఇస్తానని రాకేష్ రెడ్డి తెలిపారు. ఒక పార్టీకి అనుకూలంగా ఈ సినిమాను తీయలేదని, తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఒక సినిమాను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని రాకేష్ రెడ్డి తెలిపారు.

సినిమాలో హైలెట్స్ ఇవే

సినిమాలో హైలెట్స్ ఇవే

ఎన్టీ రామారావు జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంటరైన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను చర్చిస్తూ... రామారావు కుటుంబంలో, తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో మారిన పరిణమాలు ఫోకస్ చేస్తూ, వెన్నుపోటు పర్వాన్ని హైలెట్ చేస్తూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ఉండబోతోంది.

లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రధాన తారాగణం

లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రధాన తారాగణం

ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో థియేటర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్, లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞశెట్టి, చంద్రబాబు నాయుడు పాత్రలో శ్రీతేజ్ నటిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X