తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఎన్నికలు

2013-15 సంవత్సరాలకుగాను తెలంగాణ ఫిలిమ్ ఛాంబర్ ఎన్నికలలో మరో ఉపాధ్యక్షుడుగా ఎ.జె.ఇన్నారెడ్డి, సెక్రటరీగా కె.మురళీమోహన్, జాయింట్ సెక్రటరీగా వి.ఎల్.శ్రీ్ధర్, ట్రెజరర్‌గా ఎ.సుబ్రహ్మణ్యశాస్ర్తీ ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా బాల్‌గోవింద్‌రాజ్, తడ్ల సిహెచ్.గోవర్ధన్, పి.సుబ్రహ్మణ్యం, బి.సత్యనారాయణగౌడ్, పి.అశోక్‌రావు, వి.నాగేశ్వరరావు, ఎ.సుధాకర్‌రెడ్డి, ఎం.మోహన్‌కుమార్, వి.రవీంద్రరావు ఎన్నికయ్యారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు వల్లనే ఇక్కడి కళాకారులకు న్యాయం జరుగుతుందని, ఇక్కడి దర్శక నిర్మాతలు సినిమాల రంగంలో నిలదొక్కుకోగలుతారనే లక్ష్యంతో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఏర్పాటు చేసారు. ఇప్పటికే చాలా మంది తెలంగాణకు చెందిన వారు ప్రాంతీయ వివక్షకు గురయి సరిగా అవకాశాలు అందిపుచ్చుకోలేక పోతున్నారనే వాదన ఉంది.
పరిశ్రమలో అగ్రనటులుగా ఎదిగిన వారిలో తెలంగాణ ప్రాంతం నుంచి చాలా తక్కువగా ఉండటమే ఇందుకు నిదర్శనమని, ప్రతిభ ఉన్నప్పటికీ అవకాశాలు రాకనే వెనకబడి పోతున్నారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఇక్కడి వారికి అవకాశాలు పెరుగుతాయని చాంబర్ సభ్యులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











