twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఎన్నికలు

    By Bojja Kumar
    |

    Elections to the Telangana Film Chamber
    హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమం తీవ్రమైన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ చాంబర్‌తో విబేధిస్తూ తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఏర్పాటయిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ ఫిలిమ్ ఛాంబర్ ఎన్నికలు జరిగాయి. అధ్యక్షులుగా ఎం.విజేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా డి.వి.మూర్తి ఎన్నికయ్యారని ఛాంబర్ సెక్రటరీ ప్రకటించారు.

    2013-15 సంవత్సరాలకుగాను తెలంగాణ ఫిలిమ్ ఛాంబర్ ఎన్నికలలో మరో ఉపాధ్యక్షుడుగా ఎ.జె.ఇన్నారెడ్డి, సెక్రటరీగా కె.మురళీమోహన్, జాయింట్ సెక్రటరీగా వి.ఎల్.శ్రీ్ధర్, ట్రెజరర్‌గా ఎ.సుబ్రహ్మణ్యశాస్ర్తీ ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా బాల్‌గోవింద్‌రాజ్, తడ్ల సిహెచ్.గోవర్ధన్, పి.సుబ్రహ్మణ్యం, బి.సత్యనారాయణగౌడ్, పి.అశోక్‌రావు, వి.నాగేశ్వరరావు, ఎ.సుధాకర్‌రెడ్డి, ఎం.మోహన్‌కుమార్, వి.రవీంద్రరావు ఎన్నికయ్యారు.

    తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు వల్లనే ఇక్కడి కళాకారులకు న్యాయం జరుగుతుందని, ఇక్కడి దర్శక నిర్మాతలు సినిమాల రంగంలో నిలదొక్కుకోగలుతారనే లక్ష్యంతో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఏర్పాటు చేసారు. ఇప్పటికే చాలా మంది తెలంగాణకు చెందిన వారు ప్రాంతీయ వివక్షకు గురయి సరిగా అవకాశాలు అందిపుచ్చుకోలేక పోతున్నారనే వాదన ఉంది.

    పరిశ్రమలో అగ్రనటులుగా ఎదిగిన వారిలో తెలంగాణ ప్రాంతం నుంచి చాలా తక్కువగా ఉండటమే ఇందుకు నిదర్శనమని, ప్రతిభ ఉన్నప్పటికీ అవకాశాలు రాకనే వెనకబడి పోతున్నారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఇక్కడి వారికి అవకాశాలు పెరుగుతాయని చాంబర్ సభ్యులు అంటున్నారు.

    English summary
    
 Hyderabad: Elections to the Telangana Film Chamber of Commerce recently held and M Vijender Reddy elected as president.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X