twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మహర్షి’ రిలీజ్ వేళ విషాదం: ప్లెక్సీ కడుతూ మహేష్ అభిమాని దుర్మరణం

    |

    'మహర్షి' మూవీ రిలీజ్ వేళ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో మహేష్ బాబు అభిమానులంతా పండగ వాతావరణంలో మునిగి తేలుతుంటే.... తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం విషాదం నెలకొంది. బాబుపై తన అభిమానం చాటుకునేందకు ప్లెక్సీ కడుతుండగా ఓ అభిమాని ప్రమాదవశాత్తు మరణించారు.

    తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మండలం ధవళేశ్వరంలో బుధవారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. మరణించిన వ్యక్తిని యర్రంశెట్టి రాజీవ్‌ (27) గా గుర్తించారు. ఈ సంఘటనతో ధవళేశ్వరం మహేష్ అభిమానుల్లో విషాదం చోటు చేసుకుంది.

    ఉత్సాహంగా ప్లెక్సీ కట్టడానికి వచ్చి..

    ఉత్సాహంగా ప్లెక్సీ కట్టడానికి వచ్చి..

    స్థానిక ఇండస్ట్రియల్‌ కాలనీకి చెందిన యర్రంశెట్టి రాజీవ్‌ హార్లిక్స్‌ ఫ్యాక్టరీ ఉద్యోగిగా ఉన్నారు. మహేష్ బాబుకు వీరాభిమాని. మహర్షి రిలీజ్ సందర్భంగా తన గుర్తింపు చాటుకునేందుకు మురళీకృష్ణ థియేటర్‌ థియేటర్ వద్ద ప్లీక్సీ కట్టడానికి వచ్చారు.

    ఐరన్ ఫ్రేమ్ కారణంగా విద్యుత్ షాక్‌

    ఐరన్ ఫ్రేమ్ కారణంగా విద్యుత్ షాక్‌

    ఈ థియేటర్లో సినిమా ఆడినన్ని రోజులు తన ప్లెక్సీ అలాగే ఉండిపోవాలని భావించి ఐరన్ ఫ్రేముతో భారీ ప్లెక్సీ తయారు చేయించాడు. దాన్ని అక్కడ అమర్చేందుకు మురళీకృష్ణ థియేటర్‌ పక్కన బిల్డింగ్‌పైకి ఎక్కాడు. ఫ్లెక్సీ ఐరన్ ఫ్రేమ్‌ విద్యుత్‌ వైర్లకు తగలడంతో కరెంట్ షాక్‌కు గురై బిల్డింగ్‌పై నుంచి కిందపడ్డాడు.

    ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

    ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

    విద్యుత్ షాక్‌కు గురై... బిల్డింగ్ పై నుంచి కింద పడిపోయిన అతడిని వెంటనే 108లో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అతడు మార్గ మధ్యంలోనే ప్రాణాలు వదిలినట్లు వైద్యులు గుర్తించారు. ఈ సంఘటనతో ధవళేశ్వరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

    జాగ్రత్తగా ఉండాలని సూచించినా...

    జాగ్రత్తగా ఉండాలని సూచించినా...

    గతంలోనూ పలువురు అభిమానులు ఇలా ప్లెక్సీలు కడుతూ కరెంట్ షాక్ కారణంగా దుర్మరణం పాలైన సందర్బాలు అనేకం ఉన్నాయి. రాత్రి వేళలో ప్లెక్సీలు కట్టే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించినా.... తమ అభిమాన హీరో సినిమా ఉత్సాహంలో అవేమీ పట్టించుకోకుండా ప్రమాదాలకు గురవుతున్నారు.

    English summary
    Mahesh Babu fan yarramshetty Rajeev died at Maharshi Theatre due to Electric shock.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X