Don't Miss!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బన్నీ అమేజింగ్ డాన్సర్, అభిమానిని..నాపేరు సూర్యలో హార్థిక్ పాండ్య లవర్ ఏం చేయబోతోందంటే!
Recommended Video
బాలీవుడ్ హాట్ హీరోయిన్ ఎల్లి అవ్రం తన అందాలతో ఎప్పటికప్పుడు యువతని హీటెక్కిస్తూనే ఉంటుంది. ఈ తెల్లతోలు స్వీడన్ బ్యూటీ పలు బాలీవుడ్ చిత్రాలలో మెరిసిన సంగతి తెలిసిందే. తొలిసారి టాలీవుడ్ లోకి అడుగుపెట్టేందుకు సిద్ధం అవుతోంది. ఎల్లి అవ్రం అందగత్తె మాత్రమే కాదు. మంచి డాన్సర్ కూడా. ఎల్లి డాన్సులకు అల్లు అర్జున్ తో నాపేరు సూర్య చిత్రం చేస్తున్న దర్శకుడు వక్కంతం వంశి ఫిదా అయ్యాడట. నా పేరు సూర్య చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం వక్కంతం వంశి ఎల్లి సంప్రదించడం, ఆమె ఒకే చెప్పడం, స్పెషల్ సాంగ్ షూట్ కూడా పూర్తికావడం సైలెంట్ గా జరిగిపోయాయి. ఈ విషయాన్ని వెల్లడించిన ఎల్లి బన్నీపై ప్రశంసలు కురిపించింది.
టాలీవుడ్ కు ఎల్లి సోయగాలు
తెల్లతోలు స్వీడన్ భామ ఎల్లి అవ్రం హిందీలో కొన్ని చిత్రాల్లో మెరిసింది. టాలీవుడ్ లో ఎల్లి ఎంతవరకు ఒక్క చిత్రంలో కూడా నటించలేదు . ఆ మాటకు వస్తే సౌత్ లో ఈ భామ అడుగుపెట్టింది ఈ ఏడాదే. ఓ తమిళ చిత్రంలో ఎల్లి ఇటీవల మెరిసింది. తాజాగా అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రంలో మెరిసేందుకు సిద్ధం అవుతోంది.
సోషల్ మీడియాలో అందాల జాతర
ఎల్లి అవ్రం ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోజులతో అభిమానులని కవ్విస్తూఉంటుంది. సోషల్ మీడియాలో ఎల్లి అందాలు చూస్తే మతి పోవలసిందే. యువతలో ఎల్లికి మంచి క్రేజ్ ఉంది.
ఎల్లి డాన్స్ కు బన్నీ దర్శకుడు ఫిదా
ఎల్లి అవ్రం డాన్స్ వీడియోలని నా పేరు సూర్య చిత్ర దర్శకుడు వక్కంతం వంశి చూసి ఇంప్రెస్ అయ్యారట. వెంటనే ఎల్లిని సంప్రదించి నా పేరు సూర్య చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం ఎల్లిని అడిగారు.
బన్నీ అనగానే ఇంకేం మాట్లాడలేదు
అల్లు అర్జున్ ఎంత పెద్ద స్టారో నాకు తెలుసు. ఆయన చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం అడిగినప్పుడు తాను ఇంకేం మాట్లాడకుండా ఒకే చెప్పేశానని ఎల్లి తెలిపింది. బన్నీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడం అద్భుతమైన అనుభవం అని ఎల్లి తెలిపింది.
అమేజింగ్ డాన్సర్
ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్ స్లోగా సాగుతుందని, జానపదగేయం తరహాలో ఉంటుందని తెలిపింది. అల్లు అర్జున్ అమేజింగ్ డాన్సర్ అంటూ కితాబిచ్చింది. అల్లు అర్జున్ కు తాను పెద్ద అభిమానిని అని తెలిపింది. కానీ ఈ చిత్రంలో తనతో అల్లుఅర్జున్ డాన్స్ ఉండదని, తనది సోలో పర్ఫామెన్స్ అని చెబుతోంది.
హైదరాబాద్ లో రెండవ సారి
హైదరాబాద్ లో షూటింగ్ లో పాల్గొనడం తనకు ఇది రెండవ సారి అని ఎల్లి తెలిపింది. హైదరాబాద్ వాతావరణం చాలా బాగుందంటూ పేర్కొంది.
తెలుగు కొద్దిగా
నాపేరు సూర్య చిత్రం వలన తాను కొన్ని తెలుగు పదాలు నేర్చుకోగలిగానని ఎల్లి తెలిపింది. తెలుగు స్లాంగ్ చాలా ప్రత్యేకమైనదని ఎల్లి అభిప్రాయపడింది. కళ్ళు, మంచి, బాగున్నారా వంటి పదాలు తెలుసుకున్నానని ఎల్లి మురిసిపోతోంది.
హార్దిక్ పాండ్యతో ప్రేమాయణం
ఇల్లి అవ్రం కు సినిమాలు మాత్రమే కాక ఇతర వ్యవహారాలు కూడా బాగానే ఉన్నాయి. ఈ స్వీడన్ బ్యూటీ సెక్సీ చూపులకు టీం ఇండియా అల్ రౌండర్ హార్థిక్ పాండ్య క్లీన్ బౌల్డ్ అయినట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.