For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఏం బాబూ లడ్డూ కావాలా!’విడుదల తేదీ మార్పు

    By Srikanya
    |

    హైదరాబాద్ : శివాజీ,అదితి అగర్వాల్‌ హీరో,హీరోయిన్స్ గా నటించిన చిత్రం 'ఏం బాబూ లడ్డూ కావాలా!'. గాంధీ మనోహర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదల మొదట సెప్టెంబర్ 13న విడుదల చేయటానికి ప్లాన్ చేసారు. కానీ ఇప్పుడు దాన్ని సెప్టెంబర్ 14 కి మార్చారు. టి.జనార్ధన్‌, శ్రీ వనిత నిర్మాతలు. డ్రీమ్‌లెైన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కింది. ఎం.ఎం.శ్రీలేఖ సంగీతం అందించారు.

    ఈ విషయాన్ని మీడియాకు తెలియచేస్తూ.నిర్మాత...''టైటిల్‌కి తగ్గట్టే పూర్తి వినోదాన్ని పంచే చిత్రమిది. కథాంశం ఆసక్తికరంగా ఉంటుంది. ఐదు పాటలు వేటికవే ప్రత్యేకం.ఆడియో 'ఆదిత్య' ద్వారా మార్కెట్లోకి రిలీజెై విజయం సాధించింది. సినిమా కూడా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం. అలాగే ఈ సినిమాని అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇది లడ్డు అంత తియ్యగా ఉంటుంది. మా దర్శకుడు గాంధీమనోహర్ వినోదభరితంగా చిత్రాన్ని తీర్చిదిద్దారు '' అన్నారు.

    హీరో శివాజీ మాట్లాడుతూ "ఇలాంటి సినిమాని ఈవీవీ సత్యనారాయణ తీస్తే వంద రోజులు గ్యారంటీగా ఆడుతుంది. గాంధీ కూడా ఆ తరహాలోనే చిత్రాన్ని తీశాడు. ఈ సినిమా సెన్సేషన్ సృష్టిస్తుందనే ఫీలింగ్ ఉంది. శ్రీలేఖతో ఇది నాకు ఎనిమిదో సినిమా. భాస్కరభట్ల చాలా చక్కని పాటలు రాశారు. అందుకే ఆడియో అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమా కూడా అందరికీ నచ్చుతుంది' అని తెలిపారు.

    శివాజీ హీరోగా, అదితి అగర్వాల్, రచనా మౌర్య హీరోయిన్లుగా వనితాస్ డ్రీమ్‌లైన్ పతాకంపై జనార్దన్ టి. నిర్మించిన 'ఏం బాబూ లడ్డు కావాలా!' చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. గాంధీ మనోహర్ దర్శకుడు. ఎమ్మెస్ నారాయణ, జీవా, చిత్రం శ్రీను, సత్యం రాజేశ్, రాంజగన్, తిరుపతి ప్రకాశ్, భావన, లక్ష్మి, లహరి తారాగణమైన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: బి. వాసు, కూర్పు: వి. నాగిరెడ్డి, కళ: విజయ్‌కృష్ణ, నిర్మాణ సారథ్యం: చందక రాజ్‌కుమార్, సమర్పణ: వనిత, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: గాంధీ మనోహర్.

    English summary
    Sivaji''s latest Em Babu Laddu Kavala has been pushed by a day. Earlier the film was to be released on 13th September, but now it will hit theaters on 14th September. This romantic comedy is produced by T Janardhan and directed by Gandhi Manohar. The film is relesing on 13th september. Music has been composed by MM Sri Lekha for the lyrics penned by Bhaskarabhatla. The cinematography for the film has been handled by B Vasu and edited by Nagi Reddy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X