ఏమైంది నాలో అంటున్న రాజేంద్రప్రసాద్!
శ్రీకృష్ణపరమాత్మాడికి కాలేజ్ లో పనేంటి? అసలు కాలేజ్ లో ఆయన ఏం చేశాడు? తమాషాగా అనిపిస్తున్న ఈ ప్రశ్నలకు సమాధానమే 'ఏమైందినాలో". కళాశాల నేపథ్యంలో సాగే ప్రేమకథతో రూపోందుతున్న ఈ చిత్రంలో శివాజి, అర్చన జంటగా నటించారు. కృష్ణుడిగా ప్రత్యేకపాత్రలో నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్ కనిపిస్తారు. రాజేంద్రకుమార్ ఈచిత్రానికి దర్శకుడు. విడుదలకు సిద్ధమౌతున్న ఈ సినిమా గురించి నిర్మాత చేగొండి హరిబాబు మాట్లాడుతూ 'ప్రేమ కథల్లో ఇదో కొత్త కోణం. యూత్ కి ఈ సినిమా బాగా నచ్చుంది. వరైటి పాత్రను ఇందులో శివాజి చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్ పోషించిన శ్రీకృష్ణుడి పాత్ర ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. పాటలు మంచి ప్రేకాదరణ పొందాయి. ఈ నెల ఆఖరు వారంలో సినిమా విడుదలకు సన్నాహాలు సిద్దం చేస్తున్నారు. ఈ చిత్రం ఇతర పాత్రల్లో వేణుమాధవ్, బ్రహ్మానందం తదితరులు నటించారు.
రాజేంద్రప్రసాద్ శివాజి అర్చన రాజేంద్ర కుమార్ ఏమైంది నాలో చేగొండి హరిబాబు rajendra prasad emaindi naalo sivaji archana rajendra kumar chegondi haribabu


Click it and Unblock the Notifications