»   » ప్రభాస్, రానా, అనుష్క, రాజమౌళి, శోభూలకు చేదు అనుభవం.. దుబాయ్ విమానంలో..!

ప్రభాస్, రానా, అనుష్క, రాజమౌళి, శోభూలకు చేదు అనుభవం.. దుబాయ్ విమానంలో..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి2 రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మంచి జోష్ మీద ఉన్న నిర్మాత శోభూ యార్లగడ్డకు చేదు అనుభవం ఎదురైంది. తమను విమాన సంస్థ ఎమిరేట్స్ సిబ్బంది తమపై జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడని శోభూ ట్విట్టర్‌లో స్పందించారు. ఈ ఘటన దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది అని తెలిపారు. బాహుబలి2 ప్రమోషన్ కోసం ప్రభాస్, రానా, రాజమౌళి, అనుష్క, శోభూ యార్లగడ్డ ఇటీవల దుబాయ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే.

దుబాయ్ నుంచి తిరిగి వస్తుండగా..

దుబాయ్‌లో బాహుబలి2 ప్రమోషన్ ముగించుకొని హైదరాబాద్ తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎమిరేట్స్ సిబ్బందిలో ఒకరు తమతో దారుణంగా వ్యవహరించారు. జాతి వ్యతిరేక భావనతో అతడు ప్రవర్తించిన తీరు సరిగా లేదు అని శోభూ ట్వీట్ చేశారు. సిబ్బంది తీరుపై చిత్ర యూనిట్ అందరూ తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్టు సమాచారం.

ఎయిర్‌పోర్ట్ గేటు వద్ద..

ఎమిరేట్స్ విమానంలో హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్నాం. ఎయిర్ పోర్ట్ గేట్ వద్ద సిబ్బంది చాలా దురుసుగా ప్రవర్తించారు. ప్రభాస్, రానా, అనుష్క, రాజమౌళితోపాటు మా బృందాన్ని అనవసరంగా వేధించారు. ఆ సంస్థ సిబ్బంది దారుణంగా వ్యవహరించాడు అని ట్వీట్‌లో తెలిపారు.

జాతి వ్యతిరేక భావనతో..

జాతి వ్యతిరేక భావనతో..

ఎమిరేట్స్ సిబ్బందిలో ఓ వ్యక్తి జాతి వ్యతిరేక భావనతో ఉన్నట్టు కనిపించాడు. ఏది ఏమైనా అతడి ప్రవర్తన చాలా తప్పుడుగా ఉంది. అలాంటి వారిని ఎంపిక చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనే అభిప్రాయాన్ని శోభూ వ్యక్తం చేసినట్టు సమాచారం.

ఇలా జరుగడం ఇదే తొలిసారి..

ఇలా జరుగడం ఇదే తొలిసారి..

ఎమిరేట్స్ సంస్థ విమానంలో రెగ్యులర్‌గా ప్రయాణిస్తుంటాను. ఎప్పుడూ ఇలాంటి సంఘటన ఎదురుకాలేదు. జాతి వ్యతిరేక ధోరణి సిబ్బంది నుంంచి వ్యక్తం కావడం ఇదే తొలిసారి. అతడి తీరు చాలా ఆశ్చర్యం, ఆగ్రహం కలిగించింది అని శోభూ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ నెల 28న విడుదల

ఈ నెల 28న విడుదల

సుమారు రూ.250 కోట్ల వ్యయంతో తెరకెక్కిన బాహుబలి ది కన్‌క్లూజన్ చిత్రం ఈ నెల 28న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రం హిందీ, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో రూపొందింది. తమన్నా, నాజర్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు.

English summary
Baahubali producer Shobu Yarlagadda has accused the Emirates airlines of racism. As per reports, one of the staffer of Emirates harrashes baahubali team which includes Rajamouli, Prabhas, Rana, Anushka. The producer of the film, Shobu Yarlagadda tweeted about the incident from the airport saying that one of the Emirates staff was being racist.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu