»   » గంట పాటు ఆమె పెదాలను ముద్దులతో ముంచెత్తాడు!

గంట పాటు ఆమె పెదాలను ముద్దులతో ముంచెత్తాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్లో కిస్సుల కింగ్ అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చ పేరు ఇమ్రాన్ హష్మి. ఇప్పుడు బాలీవుడ్లో ప్రతి సినిమాలోనూ, దాదాపు అందరు హీరో హీరోయిన్లు లిప్ లాక్ ముద్దు సీన్లు చేస్తున్నా..... ముద్దు సీన్ల బాలీవుడ్ సోగ్గాడుగా ఇమ్రాన్ ముద్ర పడిపోయాడు.

అప్పట్లో ఇమ్రాన్ నటించిన మర్డర్ మొదలు కొని దాదాపు అన్ని చిత్రాల్లోనూ వరుస ముద్దు సీన్లతో బాలీవుడ్ ను షేక్ చేసాడు. అతని సినిమాల్లో ముద్దు సీన్లు లేవంటే ప్రక్షకులు ఆ సినిమాకే వెళ్లడానికి ఇష్టపడే వారు కాదు. ఆ సీన్లు లేకుండా చేసిన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అందుకే ముద్దుల బాట పట్టాడు ఇమ్రాన్.

Emraan Hashmi And Kriti Kharbanda Hot kissing

త్వరలో ఇమ్రాన్ హష్మి ‘రాజ్ -4' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో సౌత్ హీరోయిన్ కృతి కర్బంధ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ఇమ్రాన్, కృతి మధ్య బెలెడు ముద్దు సీన్లు ఉన్నాయి. సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే ఇద్దరి మధ్య కొన్ని టెస్టింగ్ సీన్లు చేసారట. ఇందులో భాగంగా ఇద్దరూ గంట పాటు ముద్దులు ప్రాక్టీస్ చేసారట. కెమెరా ముందు ఇబ్బంది పడకుండా ఉండేందుకే ఇలా ముందుగా ప్రాక్టీస్ చేయించారట. ఇమ్రాన్ హష్మి చాలా ప్రొఫెషనల్ అని, ఆయనతో గంట సేపు మళ్లీ మళ్లీ ముద్దు సీన్లు చేసినా ఎలాంటి ఇబ్బంది అనిపించలేదని అంటోందట కృతి కర్బంద.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రొమేనియాలో జరుగుతోంది. విక్రమ్ భట్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ భట్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘రాజ్' సీరిస్ లో మూడు సినిమాలు వచ్చి హిట్టయ్యాయి. ఈ సిరీస్ లో ఇది నాలుగో చిత్రం. ఈ చిత్రాన్కి ‘రాజ్-రీబూట్' అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు.

English summary
South actress Kriti Kharbanda has been chosen to be the lead actress in Raaz 4. She will be seen romancing Emraan Hashmi. South actress Kriti Kharbanda will be seen romancing actor Emraan Hashmi in the fourth instalment of "Raaz". Kriti, who has acted in Kannada and Telugu films, is now making her debut in Tamil and Hindi cinema. Besides this,Gaurav Arora who was reportedly dating actress Kriti Sanon has also been signed for Raaz 4.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu